జూన్ నుండి నిఖిల్ సినిమా..
Send us your feedback to audioarticles@vaarta.com
స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా అంటూ వరుస విజయాలను సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్ ఈ ఏడాది సమ్మర్లో `కేశవ` చిత్రంతో సందడి చేయబోతున్నాడు. ఈ సినిమా తర్వాత నిఖిల్ ఓ కన్నడ చిత్రం రీమేక్‌లో నటించబోతున్నాడు. `కిర్రిక్ పార్టీ` అనే కన్నడ హిట్ చిత్రంను తెలుగులో ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందించనున్నారు.
ఈ సినిమాను ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడనేది కన్ఫర్మ్ అయ్యింది. ఆసక్తికరమైన విషయమం ఏంటంటే ఈ సినిమాకు దర్శకుడు చంద మొండేటి డైలాగ్స్, స్క్రీన్‌ప్లే బాధ్యతలు నిర్వహిస్తాడట. జూన్ నుండి సినిమా సెట్స్‌లోకి వెళ్ళనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments