30 రోజుల్లో 38 కోట్లు వసూలు చేసిన నిఖిల్ మూవీ..!

  • IndiaGlitz, [Monday,December 19 2016]

యువ హీరో నిఖిల్ న‌టించిన తాజా చిత్రం ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా. టైగ‌ర్ ఫేమ్ వి.ఐ ఆనంద్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్ పై రూపొందిన ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా చిత్రం ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అన్ని ఏరియాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుంది.
30 రోజుల్లో 38 కోట్లు వ‌సూలు చేసి రికార్డ్ క్రియేట్ చేయ‌డం ఓ విశేష‌మైతే... నోట్ల ర‌ద్దు ప్ర‌భావం సినిమాల పై ఉన్న‌ప్ప‌టికీ ఈరేంజ్ క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేయ‌డం మ‌రో విశేషం. నిఖిల్ న‌ట‌న‌, నందితా శ్వేతా ప‌ర్ ఫార్మెన్స్, హేబ్బాప‌టేల్ గ్లామ‌ర్, అవికా గోర్ కామియో, వి.ఐ ఆనంద్ మేకింగ్, శేఖ‌ర్ చంద్ర మ్యూజిక్, సాయి శ్రీరామ్ బ్రిలియంట్ సినిమాటోగ్ర‌ఫీ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచాయి. ఈ సంచ‌ల‌న చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్ సీస్ లో కూడా రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ సాధించి 1 మిలియ‌న్ మార్క్ చేరువ‌లో ఉండ‌డం విశేషం.