నిఖిల్ పెళ్లి వాయిదా

  • IndiaGlitz, [Monday,May 04 2020]

హీరో నిఖిల్ పెళ్లి మ‌రోసారి వాయిదా ప‌డింది. ఈ విష‌యంపై ఆ హీరోనే ఇంట‌ర్వ్యూలో స్పందించారు. ఏప్రిల్ 16న నిఖిల్ డాక్ల‌ర్ ప‌ల్ల‌వి వ‌ర్మ‌ను పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. అయితే క‌రోనా ప్ర‌భావంతో పెళ్లిళ్లు చేసుకోరాద‌ని ప్ర‌భుత్వం ఆర్డ‌ర్స్ పాస్ చేసింది. దీంతో నిఖిల్ పెళ్లి వాయిదా ప‌డింది. దీంతో వీరివురి కుటుంబ పెద్ద‌లు మే 14న పెళ్లి చేయాల‌నుకున్నారు. అయితే కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్‌ను మే 17 వ‌ర‌కు పొడిగించింది. దీంతో మ‌రోసారి నిఖిల్‌, ప‌ల్ల‌వి వ‌ర్మ‌ల పెళ్లి వాయిదా ప‌డింది. ఈ విష‌యం నిఖిల్ మాట్లాడారు.

‘‘ముందుగా మా పెద్దలు ఏప్రిల్ 16న మా పెళ్లి జరపాలని నిశ్చయించుకున్నారు. లాక్డౌన్ కారణంగా వాయిదా వేసుకున్నాం. తర్వాత మే 14న ముహూర్తం నిర్ణయించుకున్నాం. మళ్లీ లాక్‌డౌన్‌ను మే 17 వ‌ర‌కు పొడిగించారు. దీంతో నిరాశ‌కు గుర‌య్యాను. అయితే నా పెళ్లి కార‌ణంగా ఎవ‌రికీ ఇబ్బంది రాకూడ‌దు. ఒక‌వేళ ఇబ్బంది వ‌స్తే నాకు బాధ‌గా ఉంటుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో పెళ్లి చేసుకోవ‌డం క‌రెక్ట్ కాదు. పెళ్లి అనేది మ‌ధుర‌మైన జ్ఞాప‌కం. అది బాగా జ‌ర‌గాలి. క‌రోనా వైర‌స్ అంతా నియంత్ర‌ణ‌లోకి వ‌చ్చిన త‌ర్వాతే పెళ్లి చేసుకుంటాను’’ అన్నారు నిఖిల్‌.

More News

త‌మిళ హీరోతో మెగాడాట‌ర్‌

మెగా బ్ర‌ద‌ర్ త‌న‌య నిహారిక కొణిదెల ఒక మ‌న‌సు సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైంది. ఈమె చేసిన సూర్య‌కాంతం, అంత‌కు ముందే విజ‌య్ సేతుప‌తి, గౌత‌మ్ కార్తీక్‌ల‌తో ఓ త‌మిళ సినిమాలో

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయ్!

కరోనా మహమ్మారి నుంచి తెలంగాణ బయటపడినట్లే అని గత వారం రోజులుగా అనిపించినప్పటికీ.. రెండు మూడ్రోజులుగా కేసులను బట్టి చూస్తే మళ్లీ విజృంభిస్తోందని చెప్పుకోవచ్చు.

మందు బాబులకు జగన్ సర్కార్ భారీ షాక్

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ పొడిగించిన కేంద్రం ప్రభుత్వం.. తాజాగా మరోసారి 3.0 పేరుతో మే-17వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.

ఏపీకి మరో ముప్పు.. దూసుకొస్తున్న భారీ తుఫాన్!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో విలయతాండవం చేస్తుండగా.. తాజాగా రాష్ట్రానికి మరో ముప్పు రాబోతోంది. ఏపీకి భారీ తుఫాన్ ముప్

బన్నీ 'పుష్ప'లో 6కోట్లతో భారీ యాక్షన్ సీన్!

టాలీవుడ్ స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అలియాస్ బన్నీ.. క్రియేటివ్‌ హెడ్‌గా పేరుగాంచిన సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఇప్పటికే బన్నీ బర్త్‌డే సందర్భంగా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను