నిఖిల్ పెళ్లి వాయిదా
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో నిఖిల్ పెళ్లి మరోసారి వాయిదా పడింది. ఈ విషయంపై ఆ హీరోనే ఇంటర్వ్యూలో స్పందించారు. ఏప్రిల్ 16న నిఖిల్ డాక్లర్ పల్లవి వర్మను పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే కరోనా ప్రభావంతో పెళ్లిళ్లు చేసుకోరాదని ప్రభుత్వం ఆర్డర్స్ పాస్ చేసింది. దీంతో నిఖిల్ పెళ్లి వాయిదా పడింది. దీంతో వీరివురి కుటుంబ పెద్దలు మే 14న పెళ్లి చేయాలనుకున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 17 వరకు పొడిగించింది. దీంతో మరోసారి నిఖిల్, పల్లవి వర్మల పెళ్లి వాయిదా పడింది. ఈ విషయం నిఖిల్ మాట్లాడారు.
‘‘ముందుగా మా పెద్దలు ఏప్రిల్ 16న మా పెళ్లి జరపాలని నిశ్చయించుకున్నారు. లాక్డౌన్ కారణంగా వాయిదా వేసుకున్నాం. తర్వాత మే 14న ముహూర్తం నిర్ణయించుకున్నాం. మళ్లీ లాక్‌డౌన్‌ను మే 17 వరకు పొడిగించారు. దీంతో నిరాశకు గురయ్యాను. అయితే నా పెళ్లి కారణంగా ఎవరికీ ఇబ్బంది రాకూడదు. ఒకవేళ ఇబ్బంది వస్తే నాకు బాధగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. పెళ్లి అనేది మధురమైన జ్ఞాపకం. అది బాగా జరగాలి. కరోనా వైరస్ అంతా నియంత్రణలోకి వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను’’ అన్నారు నిఖిల్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com