సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ సాంగ్ ను రిలీజ్ చేసిన హీరో నిఖిల్

  • IndiaGlitz, [Wednesday,August 03 2016]
ఎప్ప‌టిక‌ప్పుడు తాజా వార్తావిశేషాల‌ను అందిస్తూ...ప్ర‌తి సంవ‌త్స‌రం అవార్డ్స్ అందిస్తూ...త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సొంతం చేసుకున్న ప్ర‌ముఖ‌ సినీవార‌ప‌త్రిక సంతోషం. ఈ ఆగ‌స్టు 2 కి సంతోషం సినీవార‌ప‌త్రిక 14 వ‌సంతాలు పూర్తి చేసుకుని, దిగ్విజ‌యంగా 15వ సంవ‌త్స‌రంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా సంతోషం 14వ వార్షికోత్స‌వ సంబ‌రాలు, సంతోషం సౌత్ ఇండియా ఫిలిం అవార్డ్స్‌ వేడుక‌లు ఆగ‌స్టు14 న గ‌చ్చిబౌళి ఇండోర్ స్టేడియంలో సాయంత్రం 5 గంట‌ల నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో హీరో నిఖిల్, విశ్వ రాసి, కంపోజ్ చేసిన సంతోషం సాంగ్‌ను విడుద‌ల చేశారు. అలాగే హీరోయిన్ క్యాథ‌రిన్ హీరో నిఖిల్‌, థ‌మ‌న్ ల‌కు తొలి ఇన్విటేష‌న్స్‌ను అందచేసారు.
ఈ సంద‌ర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ...నా చిన్న‌ప్ప‌ట్నుంచి ఈ అవార్డు వేడుక‌ల‌ను చూస్తున్నాను. విశ్వ మంచి సాంగ్‌ను రాసి, కంపోజ్ చేశారు. సాంగ్ చాలా బావుంది. సంతోషం సినీ వార ప‌త్రిక 14ఏళ్ల‌ను పూర్తి చేసుకుంది. నంది, ఫిలింఫేర్ అవార్డులు త‌ర్వాత ఆస్థాయిలో జ‌ర‌గుతున్న అవార్డుల కార్య‌క్ర‌మం ఇది. న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్‌ను ఎంక‌రేజ్ చేయ‌డంలో భాగంగా ఈ అవార్డుల‌ను ప్ర‌ధానం చేస్తున్నారు. ఈ అవార్డుల వేడుక చాలా కాలం కొన‌సాగాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.
విశ్వ మాట్లాడుతూ... ప‌ద్నాలుగేళ్ళుగా సురేష్ సంతోషం మేగ‌జైన్ ద్వారా సినిమా రంగానికి సేవ చేస్తూనే అవార్డుల‌ను ఇస్తున్నారు. ఈ సారి సంతోషం సాంగ్‌ను రాయ‌మ‌న్నారు. నా శాయ‌శ‌క్తులా మంచి సాంగ్‌ను రాసి, కంపోజ్ చేశాన‌నే అనుకుంటున్నాను. ఆగ‌స్ట్ 14న జ‌రుగ‌నున్న వేడుక పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.
డైరెక్ట‌ర్ క‌ల్యాణ్ కృష్ణ మాట్లాడుతూ...సురేష్ తో నాకు మంచి ప‌రిచ‌యం ఉంది.సంతోషం మేగ‌జైన్‌తో పాటు అవార్డుల‌ను అందిస్తూ ఎంక‌రేజ్ చేస్తున్నారు. నంది అవార్డుల‌తో పాటు ఈ సంతోషం అవార్డుల‌కు ఓ క్రేజ్ ఏర్ప‌డింది. ప్ర‌తి సంవ‌త్సరం ఈ అవార్డు వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తూ వ‌చ్చి ఇప్పుడు ద‌క్షిణాది సినీ రంగాల్లో అంద‌రికీ ఇస్తున్నారు అన్నారు.
ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్ మాట్లాడుతూ...ప‌రిశ్ర‌మ‌లో సురేష్‌కు అంద‌రి స‌పోర్ట్ ఉంది. సంతోషం అవార్డుల‌తో చాలా మంది న‌టీన‌టుల‌ను, టెక్నిషియ‌న్స్‌ను ఎంక‌రేజ్ చేస్తూ వ‌స్తున్నారు. ఈ ఏడాది ఆగ‌స్ట్ 14న జ‌రుగ‌నున్న ఫంక్ష‌న్ గ్రాండ్ స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.
సురేష్ కొండేటి మాట్లాడుతూ...నేను బ్ర‌తికున్నంత కాలం ఈ సంతోషం అవార్డుల‌ను నిర్వ‌హిస్తాను. నాకు ఎవ‌రూ హెల్ప్ చేయ‌క‌పోయినా ఫ‌ర‌వాలేదు కానీ... చెడ‌గొట్ట‌వ‌ద్ద‌ని కోరుకుంటున్నాను. సంతోషం మేగ‌జైన్ స్టార్ట్ చేసిన రెండో సంత్స‌రం బాల‌కృష్ణ‌గారు సంతోషం పేరు పై అవార్డులు ఇస్తే బావుంటుంద‌ని అన్నారు. ఆయ‌న మాట‌తో ఈ సంతోషం అవార్డుల‌ను స్టార్ట్ చేశాను. అలాగే చిరంజీవిగారు మ‌రో ఫంక్ష‌న్‌లో నన్ను డిస్ట్రిబ్యూట‌ర్‌, నిర్మాత‌గా ఎద‌గాల‌ని అన్నారు. ఆయ‌న మాట‌తో నేను డిస్ట్రిబ్యూట‌ర్ అయ్యాను. 74 సినిమాల‌ను డిస్ట్రిబ్యూట్ చేశాను. అలాగే నిర్మాత 15 సినిమాలు చేశాను. అంద‌రి స‌హ‌కారంతో ముందుకెళ్తున్నాను. నా టీంలో సీనియ‌ర్ పాత్రికేయులు ప‌సుపులేటి రామారావుగారు, వాసు బాగా స‌పోర్ట్ చేస్తున్నారు. వారి స‌పోర్ట్ తో ముందుకు వెళుతున్నాను అన్నారు.
ఈ క్యార్య‌క్ర‌మంలో హీరోయిన్ క్యాథ‌రిన్‌, ఏడిద శ్రీరాం, శివాజీ రాజా త‌దిత‌రులు పాల్గొన్నారు.

More News

26th film of NTR, Samantha is the same one!

In an industry where sentiment is valued a lot, numbers matter. By numbers is not meant collections always. It could be dates, it could be the number in a title, it could be anything.

Interesting details about Udhayanidhi Stalin's next with Ezhil

Udhayanidhi Stalin’s initial phase of acting career involved only comedy capers. But now he seems to have decided to move out of his comfort zone and experiment with unconventional genres, which was evident with his earlier films of the year ‘Gethu’ and ‘Manithan’ .

Important update on progress of Vishal's 'Kaththi Sandai'

Vishal is presently busy shooting for 'Kaththi Sandai' directed by Suraaj. The film produced by S.Nandagopal of Madras Enterprises banner will see the first time pairing up of Vishal and Tamannah.

A new start for 'Vijay 60' today

As we all know Ilayathalapathy Vijay is presently busy with his landmark 60th film which is being directed by Bharathan of 'Azhagiya Tamil Magan' fame.

Remo D'Souza designs 'Toota Jo Kabhi Tara' as an 'out of the world' romantic song for Tiger and Jacqueline

In an awe inspiring career, Remo D'Souza has choreographed hundreds of spell binding songs for screen. It took a much bigger proportion when he went on to direct F.A.L.T.U., ABCD - Any Body Can Dance and then its sequel ABCD 2. Many wondered if he would get ample scope to experiment with the song-n-dance routine when it came to his superhero action comedy affair, A Flying Jatt.