ఫిబ్రవరి 9న విడుదలవుతున్న నిఖిల్ 'కిర్రాక్ పార్టీ'
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నిఖిల్ హీరోగా కన్నడ సూపర్ హిట్ సినిమా "కిరిక్ పార్టీ"ని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్ టైన్మెంట్ సంస్థ తెలుగులో 'కిర్రాక్ పార్టీ'గా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. నిఖిల్ సరసన సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరీంజా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా శరణ్ కొప్పిశెట్టి అనే యువ ప్రతిభాశాలి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
ఈ చిత్రానికి యువ దర్శకులు సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే, మరో యువ దర్శకుడు చందూ మొండేటి సంభాషణలు సమకూరుస్తుండడం విశేషం. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. "షూటింగ్ శరవేగంగా జరుగుతోంది, ప్రస్తుతం రాజమండ్రిలో కీలక సన్నివేశాల చిత్రీకరణతోపాటు హైద్రాబాద్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా సమాంతరంగా జరుగుతోంది.ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి విశేషమైన స్పందన లభించింది.
నిఖిల్ మాచో లుక్ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ను పెంచాయి. 'హ్యాపీడేస్' తర్వాత తెలుగులో కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న పూర్తి స్థాయి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా 'కిర్రాక్ పార్టీ' నిలుస్తుంది. ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా మా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్నాధ్. మాటలు: చందూ మొండేటి, స్క్రీన్ ప్లే: సుధీర్ వర్మ, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, కళ: అవినాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి, కో-డైరెక్టర్: సాయి దాసమ్, కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర-అభిషేక్ అగర్వాల్, బ్యానర్: ఎ.కె.ఎంటర్ టైన్మెంట్, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com