ఫిబ్రవరి 9న విడుదలవుతున్న నిఖిల్ 'కిర్రాక్ పార్టీ'

  • IndiaGlitz, [Saturday,December 09 2017]

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నిఖిల్ హీరోగా కన్నడ సూపర్ హిట్ సినిమా "కిరిక్ పార్టీ"ని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్ టైన్మెంట్ సంస్థ తెలుగులో 'కిర్రాక్ పార్టీ'గా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. నిఖిల్ సరసన సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరీంజా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా శరణ్ కొప్పిశెట్టి అనే యువ ప్రతిభాశాలి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

ఈ చిత్రానికి యువ దర్శకులు సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే, మరో యువ దర్శకుడు చందూ మొండేటి సంభాషణలు సమకూరుస్తుండడం విశేషం. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. "షూటింగ్ శరవేగంగా జరుగుతోంది, ప్రస్తుతం రాజమండ్రిలో కీలక సన్నివేశాల చిత్రీకరణతోపాటు హైద్రాబాద్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా సమాంతరంగా జరుగుతోంది.ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి విశేషమైన స్పందన లభించింది.

నిఖిల్ మాచో లుక్ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ను పెంచాయి. 'హ్యాపీడేస్' తర్వాత తెలుగులో కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న పూర్తి స్థాయి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా 'కిర్రాక్ పార్టీ' నిలుస్తుంది. ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా మా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్నాధ్. మాటలు: చందూ మొండేటి, స్క్రీన్ ప్లే: సుధీర్ వర్మ, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, కళ: అవినాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి, కో-డైరెక్టర్: సాయి దాసమ్, కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర-అభిషేక్ అగర్వాల్, బ్యానర్: ఎ.కె.ఎంటర్ టైన్మెంట్, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి.

More News

డిసెంబర్ 22న రిలీజ్ అవుతున్న 'ఇ ఈ'

నీరజ్‌ శ్యామ్‌, నైరా షా జంటగా నటించిన చిత్రం 'ఇ ఈ'. రామ్ గణపతిరావు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమౌతున్నారు. నవబాల క్రియేషన్స్ పతాకంపై లక్ష్మమ్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. కృష్ణ చేతన్ టీఆర్ స్వరాలందించారు.

'రంగ‌స్థ‌లం' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై రూపొందిన భారీ చిత్రం 'రంగ‌స్థ‌లం'. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌) నిర్మాత‌లు ఈ ప్రెస్టీజియ‌స్ చిత్రాన్ని నిర్మించారు.

ప్రభాస్ కి పాడాలని ఉందట‌

బాలీవుడ్ టాలెంటెడ్ సింగర్ అర్మాన్ మాలిక్. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ, ఉర్దూ భాషల్లో కూడా పాటలు పాడారు.

'హ‌లో'.. మెరిసే మెరిసే పాట విశ్లేష‌ణ‌

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'హలో'. అఖిల్ అక్కినేని, కళ్యాణి ప్రియదర్శన్ జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, జగపతిబాబు, అజయ్ ముఖ్య పాత్రలు పోషించారు.

విజ‌య్ దేవ‌రకొండ కొత్త మూవీ టైటిల్‌

ప్ర‌స్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యూత్ హీరోల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక‌డు. పెళ్ళి చూపులు స‌క్సెస్ త‌ర్వాత విడుద‌లైన 'అర్జున్ రెడ్డి' సెన్సేష‌న‌ల్ హిట్ కావ‌డంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. దీంతో వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా ఉన్నారు.