నిఖిల్ 'కిరాక్ పార్టీ' తొలి పాట‌... విడుద‌ల‌

  • IndiaGlitz, [Monday,January 22 2018]

వ‌రుస విజ‌యాల‌తో, వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో దూసుకుపోతున్న యువ క‌థానాయ‌కుడు నిఖిల్ న‌టిస్తున్న 15వ చిత్రం 'కిరాక్ పార్టీ'. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. సిమ్ర‌న్ ప‌ర్జీనా, సంయుక్త హెగ్డే క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఏ టీవీ స‌మ‌ర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత‌. శ‌ర‌ణ్‌ కొప్పిశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఈ చిత్రంలోని తొలి పాట 'దమ్ దారే' ని ఈరోజు సాయింత్రం హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు. వ‌న‌మాలి ర‌చించిన ఈ గీతాన్ని హ‌రి చ‌ర‌ణ్ ఆల‌పించారు. అజ‌నీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు. నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఫిబ్ర‌వ‌రి 9న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు సుధీర్ వ‌ర్మ ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లేనీ, మ‌రో ద‌ర్శ‌కుడు చందూ మొండేటి సంభాష‌ణ‌ల‌నూ అందించ‌డం విశేషం. "ఇటీవ‌ల విడుద‌ల చేసిన ప్రీ టీజ‌ర్‌కి మంచి స్పంద‌న వ‌చ్చింది. 'ద‌మ్ దారే' పాట యువ‌త‌తో పాటు అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. మిగిలిన పాట‌ల్ని ఒకొక్క‌టిగా విడుద‌ల చేస్తామ‌"ని చిత్ర‌బృందం తెలిపింది.

ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: కిషోర్ గ‌రికి పాటి, కో ప్రొడ్యూస‌ర్‌: అజ‌య్ సుంక‌ర‌, అభిషేక్ అగ‌ర్వాల్‌, ద‌ర్శ‌క‌త్వం: శ‌ర‌న్ కొప్పిశెట్టి, సంగీతం: అజ‌నీష్ లోక్‌నాథ్‌, క‌ళ‌: అవినాష్‌, కూఎడిటింగ్‌: ఎం.ఆర్ వ‌ర్మ‌

More News

సాయిధరమ్ తేజ్ 'ఇంటిలిజెంట్' ఫస్ట్ లుక్

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా సి.కె.ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై

బాలయ్య సినిమాతోనే దక్కింది

‘పురియాదా పుదిర్’(1990)చిత్రంతో తమిళ ఇండస్ట్రీలో దర్శకుడిగా అడుగుపెట్టారు కె.ఎస్.రవికుమార్..

తేజని గట్టెక్కించిన వెంకీ నిర్ణయం

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటించిన 'గురు'సినిమా విడుదలై దాదాపు ఏడాది కావస్తోంది.

ఏడు భాషల్లో అల్లు అర్జున్ సందడి

'ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు'..ఈ మాట స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కి సరిగ్గా సరిపోతుంది.

వాలీబాల్ ఆట నేపథ్యంలో..

బెల్లంకొండ శ్రీనివాస్..నటించింది మూడు సినిమాలే అయినా తనకంటూ ఒక ఇమేజ్ ని సొంతం చేసుకున్న యువ కథానాయకుడు.