నిఖిల్ కేశవ ఫస్ట్ లుక్ రిలీజ్..!

  • IndiaGlitz, [Saturday,December 24 2016]

ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా సినిమాతో సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించిన నిఖిల్ తాజా చిత్రం కేశ‌వ‌. ఈ చిత్రాన్ని స్వామి రారా ఫేమ్ సుధీర్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్నారు. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై అభిషేక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.డిఫ‌రెంట్ రివేంజ్ ల‌వ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రీ లుక్ ఇటీవ‌ల రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. కేశ‌వ ప్రీ లుక్ కు అనూహ్య స్పంద‌న ల‌భించింది. ఇక ఈరోజు కేశ‌వ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసారు. డిఫ‌రెంట్ లుక్ తో ఉన్న నిఖిల్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ సినిమా పై మరిన్ని అంచ‌నాల‌ను పెంచేస్తుంది. ఖ‌చ్చితంగా ఇది రెగ్యుల‌ర్ మూవీ కాదు ఇందులో ఏదో కొత్త‌ద‌నం ఉంది అనిపిస్తుంది. వైవిధ్య‌మైన క‌ధాంశ‌ల‌తో స‌క్సెస్ సాధిస్తున్న నిఖిల్ కేశ‌వ సినిమాతో కూడా విజ‌యం సాధిస్తాడ‌ని ఆశిద్దాం.