రీమేక్‌లో నిఖిల్ హీరోయిన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
గతేడాది నవంబర్‌లో విడుదలై మంచి విజయం సాధించిన చిత్రం ఎక్కడికి పోతావ్ చిన్నవాడా. నిఖిల్ హీరోగా నటించిన ఈ చిత్రంలో హెబ్బా పటేల్, నందితా శ్వేత, అవికా గోర్ హీరోయిన్స్‌గా నటించిన సంగతి తెలిసిందే.
మరో సారి హెబ్బా, నందితా ఒకే సినిమాలో నటించనున్నారు. అయితే ఆ సినిమా మలయాళంలో విజయం సాధించిన 100 డిగ్రీస్ సెల్సియస్ అనే చిత్రానికి రీమేక్ వెర్షన్. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో రాయ్ లక్ష్మీ, రాగిణి ద్వివేది, నిఖిషా పటేల్ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఐదుగురు అమ్మాయిల చుట్టూ తిరిగే ఈ విమెన్ సెంట్రిక్ సబ్జెక్ట్‌ని అనువాద చిత్రాల నిర్మాత ఎ.శోభారాణి నిర్మిస్తున్నారు. రెడీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రాలను తమిళంలో రూపొందించిన మిత్రన్ జవహర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com