తుపాను బాధితులకు అండగా నిఖిల్...
Send us your feedback to audioarticles@vaarta.com
యువ హీరోలందరూ కేవలం సినిమాలే కాకుండా సమాజ సేవ పట్ల కూడా తమ బాధ్యతను గుర్తెరిగి పనిచేస్తున్నారు. ప్రజలకు ఏదైనా ఇబ్బందులు వస్తే వెంటనే స్పందిస్తున్నారు. రీసెంట్గా తితలీ తుపాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలో 165 గ్రామాలకు చెందిన ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు.
విషయం తెలిసిన ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్, సంపూర్ణేష్ బాబు ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. కాగా హీరో నిఖిల్ అయితే ఏకంగా శ్రీకాకుళంలో బాధిత ప్రాంతానికి స్వయంగా చేరుకుని సహాయ చర్యల్లో పాల్గొంటున్నాడు. `2500 కిలోల బియ్యం, పొర్టెబుల్ జనరేటర్స్, 3000 మందికి తిండికి సిద్ధం చేశా`మని అన్న నిఖిల్ వారితోనే కలిసి రాత్రి బోజనం కూడా చేశాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout