డిసెంబర్లో విడుదల కానున్న '18 పేజీస్'

  • IndiaGlitz, [Wednesday,October 26 2022]

ఫైనల్ షెడ్యూల్ కి హాజరైన నిఖిల్

ఇటీవలే కార్తికేయ-2 సినిమాతో హిట్ అందుకున్న నిఖిల్ సిద్ధార్థ మరియు అనుపమ పరమేశ్వరన్ మరోసారి 18 పేజీస్ సినిమాకి జతకట్టారు. ఈ నాస్టాల్జిక్ రొమాన్స్‌ని పుష్ప దర్శకుడు సుకుమార్ రాశారు. ఇదే కాకుండా గతంలో కుమారి 21 ఎఫ్ చిత్రానికి కూడా కథను అందించారు. అతని శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు.

ఈ 18 పేజిస్ సినిమాను సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి GA2 పిక్చర్స్‌పై బన్నీ వాస్ నిర్మించారు.

ప్రస్తుతం ఈ సినిమా తుది దశకు చేరుకుంది. కొంచెం విరామం తర్వాత, నిఖిల్ 18 పేజీస్ సెట్‌కి తిరిగి వచ్చారు. మరియు 18 పేజీస్ చివరి షెడ్యూల్ ఇటీవల ప్రారంభమైంది, చిత్రీకరణ కూడా అద్భుతంగా కొనసాగుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను డిసెంబర్ 23న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

సినిమాటోగ్రాఫర్ ఎ వసంత్ విజువల్స్ సినిమా ఫీల్ గుడ్ వైబ్‌ని పెంచాయి. 18 పేజీస్ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్ వర్క్ చేస్తున్నారు. ప్రముఖ అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

More News

ఏ ప్లాన్ వర్కవుట్ కాక... వెక్కి వెక్కి ఏడ్చిన గీతూ పాప, ‘‘ఆ బూతు’’లతో హౌస్‌లో రచ్చరచ్చ

బిగ్‌బాస్ సీజన్ 6లో ఆడియన్స్‌ని ఆకట్టుకున్న ఎపిసోడ్స్ గురించి చెప్పమంటే వ్రేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అలా వుంది పరిస్ధితి. తొలి సీజన్ నుంచి నేటి వరకు అదే కాలం చెల్లిన టాస్కులు, ఎంటర్‌టైన్‌ చేయలేని

Chiranjeevi : మృగాళ్లకు కఠిన శిక్షపడాల్సిందే... డీఏవీ స్కూల్‌ ఘటనపై చిరు స్పందన

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని డీఏవీ పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారిపై జరిగిన దారుణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సదరు స్కూల్ ప్రిన్సిపాల్‌ మాధవి వద్ద

సూర్య- శ్రీహాన్‌లు నాకు అంతే.. రిలేషన్‌పై కుండబద్ధలు కొట్టిన ఇనయా, మెరీనా విశ్వరూపం

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. కంటెస్టెంట్స్‌కి బదులు బిగ్‌బాసే గేమ్ ఆడుతూ వుండటంతో ఆడియన్స్‌కి ఇప్పుడిప్పుడే ఇంట్రెస్ట్ వస్తోంది. దీనికి తోడు దీపావళి వేడుకలు అంబరాన్ని

Rishi Sunak : బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్... ఇంగ్లీష్ గడ్డను ఏలనున్న భారత సంతతి బిడ్డ ..!!

బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మెజారిటీ ఎంపీలు ఆయన నాయకత్వంపై నమ్మకం వుంచడంతో ఎలాంటి పోటీ లేకుండా రిషి అత్యున్నత పీఠాన్ని అధిరోహించారు.

'టిల్లు స్క్వేర్'తో రెట్టింపు వినోదం

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన 'డీజే టిల్లు' ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఈ చిత్ర విడుదల సమయంలోనే నిర్మాత సూర్యదేవర