18 Pages: '18 పేజిస్' చిత్రం నుండి 'నన్నయ్య రాసిన' లిరికల్ వీడియో విడుదల

  • IndiaGlitz, [Friday,November 18 2022]

వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న జీఏ 2 పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం 18 పేజిస్ నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు.మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇదివరకే రిలీజైన ఈ చిత్ర టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది.

ఇటీవలే కార్తికేయ-2 సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు నిఖిల్ సిద్ధార్థ & అనుపమ పరమేశ్వరన్. మాములు చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం రోజురోజుకు థియేటర్స్ ను, కలక్షన్స్ ను పెంచుకుంటూ తిరుగులేని విజయాన్ని సాధించింది. కృష్ణ తత్వాన్ని, కృష్ణ సారాంశాన్ని చెప్పిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలక్షన్స్ సాధించింది. అంతటి ఘనవిజయం సాధించిన కార్తికేయ- 2 తరువాత అనుపమ పరమేశ్వరన్, నిఖిల్ జంటగా చేస్తున్న చిత్రం కావడంతో ఈ 18 పేజిస్ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంను డిసెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నాస్టాల్జిక్ రొమాన్స్‌ని పుష్ప దర్శకుడు సుకుమార్ రాశారు. ఇదివరకే గతంలో కుమారి 21 ఎఫ్ చిత్రంతో హిట్ అందుకున్న పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

18 పేజిస్ చిత్రం నుండి విడుదలకాబోయే సాంగ్ అప్డేట్ ను అధికారికంగా ప్రటించారు మేకర్స్. ఈ చిత్రం నుండి నన్నయ్య రాసిన అనే లిరికల్ వీడియో సాంగ్ ను నవంబర్ 22న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 23న క్రిస్టమస్ కానుకగా విడుదల చేయనున్నారు.

తారాగణం: నిఖిల్ సిద్దార్థ & అనుపమ పరమేశ్వరన్

More News

'సీతారాం సిత్రాలు' టైటిల్ లోగో ఆవిష్కరణ!!!

రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న చిత్రం సీతారాం సిత్రాలు.

BiggBoss: కృష్ణ మరణంతో షాక్‌లో ఇంటి సభ్యులు.. రెండవసారి కెప్టెన్‌గా రేవంత్

గొడవలు, వివాదాలతో సాగిపోతున్న బిగ్‌బాస్ హౌస్ సభ్యులకు బయట ఏం జరుగుతుందో తెలియదు.

Viral Video: మహిళ కడుపులో 4 అడుగుల పాము... బయటికి తీసిన డాక్టర్లు, చివరికి షాక్..!!

అప్పుడప్పుడు వైద్యులు కొన్ని అరుదైన ఆపరేషన్లు చేసిన ఫోటోలు, వీడియోలు మీడియాలో కనిపిస్తే అంతా షాక్‌కు గురవుతాం.

sudigali sudheer : వామ్మో... ‘‘గాలోడు’’ కోసం సుడిగాలి సుధీర్ రెమ్యూనరేషన్ అంతా..?

కృషి, పట్టుదల, క్రమశిక్షణ వుంటే ఎవరైనా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని రుజువు చేసిన వారు సినీ పరిశ్రమలో ఎందరో.

Adipurush : ఆదిపురుష్ డ్రాగన్ సీన్ రీక్రియేట్ ... ఔత్సాహికుడి టాలెంట్‌కు నెటిజన్ల ఫిదా

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘‘ఆదిపురుష్’’.