నిఖిల్ 15 అప్ డేట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
మంచి కథల్ని ఎన్నుకుని సినిమాలు చేసే యువ కథానాయకుల్లో నిఖిల్ ముందుంటారు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో.. కన్నడలో సూపర్ హిట్ చిత్రంగా పేరుతెచ్చుకున్న కిరిక్ పార్టీ` సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాతో తన కెరీర్ లో 15 సినిమాలను పూర్తిచేస్తున్నారు నిఖిల్.
ఈ మూవీ ఉత్తరాఖండ్, నార్త్ ఇండియాలోని చాలా లొకేషన్స్ లో షూటింగ్ ని పూర్తి చేసుకుంది. ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమా ప్రీ-లుక్ ని నవంబర్ 30న.. అలాగే టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ని డిసెంబర్ 2న రిలీజ్ చేయబోతున్నారు.
కన్నడ వెర్షన్ లో హీరోయిన్ గా నటించిన సంయుక్త హెగ్డే ఈ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమౌతున్నారు. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్ పై నిర్మితమౌతున్న 11వ ప్రాజెక్ట్ ఇది. సుధీర్ వర్మ స్క్రీన్ ప్లేని అందిస్తున్న ఈ సినిమాకి.. చందూ మొండేటి డైలాగ్స్ రాస్తున్నారు.
ఈ ఇద్దరు డైరెక్టర్స్ నిఖిల్ ఫ్రెండ్స్ కావడం వలన.. ఈ సినిమాకు తమ వంతు సాయం అందిస్తున్నారు. ఈ చిత్రం షరన్ కొప్పిశెట్టి డైరెక్షన్లో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి కిర్రాక్ పార్టీ అనే పేరు వినిపిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments