నిఖిల్ 15 అప్ డేట్స్

  • IndiaGlitz, [Wednesday,November 29 2017]

మంచి కథల్ని ఎన్నుకుని సినిమాలు చేసే యువ క‌థానాయ‌కుల్లో నిఖిల్ ముందుంటారు. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో.. కన్నడలో సూపర్ హిట్ చిత్రంగా పేరుతెచ్చుకున్న కిరిక్ పార్టీ' సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాతో తన కెరీర్ లో 15 సినిమాల‌ను పూర్తిచేస్తున్నారు నిఖిల్.

ఈ మూవీ ఉత్తరాఖండ్, నార్త్ ఇండియాలోని చాలా లొకేషన్స్ లో షూటింగ్ ని పూర్తి చేసుకుంది. ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమా ప్రీ-లుక్ ని నవంబర్ 30న.. అలాగే టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ని డిసెంబర్ 2న రిలీజ్ చేయబోతున్నారు.

కన్నడ వెర్షన్ లో హీరోయిన్ గా నటించిన సంయుక్త హెగ్డే ఈ సినిమాతో తెలుగు తెరకు క‌థానాయిక‌గా పరిచయమౌతున్నారు. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్ సుంకర ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్ పై నిర్మితమౌతున్న 11వ ప్రాజెక్ట్ ఇది. సుధీర్ వర్మ స్క్రీన్ ప్లేని అందిస్తున్న ఈ సినిమాకి.. చందూ మొండేటి డైలాగ్స్ రాస్తున్నారు.

ఈ ఇద్దరు డైరెక్టర్స్ నిఖిల్ ఫ్రెండ్స్ కావడం వలన.. ఈ సినిమాకు తమ వంతు సాయం అందిస్తున్నారు. ఈ చిత్రం షరన్ కొప్పిశెట్టి డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి కిర్రాక్ పార్టీ అనే పేరు వినిపిస్తోంది.

More News

పవన్ రీమేక్ కన్ ఫర్మ్ అయినట్టే

తెలుగులో రీమేక్ కథలంటే ఇష్టపడే హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయన కెరీర్లో చేసిన రీమేక్ సినిమాలన్నీ దాదాపు హిట్ అనే చెప్పాలి.

జనవరిలో రానున్న 'రంగస్థలం' ఫస్ట్ లుక్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘రంగస్థలం 1985’. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటిస్తోంది. యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను సమకూరుస్తున్నారు.

నాగ శౌర్య కథానాయకునిగా మన్యం ప్రొడక్షన్స్ నూతన చిత్రం ప్రారంభం

యువ కథానాయకుడు నాగ శౌర్య నూతన చిత్రం నేడు (29-11-17) ఉదయం 10 గంటల 34 నిమిషాలకు సంస్థ కార్యాలయం లో ప్రారంభ మయింది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ క్లాప్ నిచ్చారు.

రామ్-త్రినాథ‌రావు-దిల్ రాజు కాంబినేష‌న్‌లో కొత్త చిత్రం

ఈ ఏడాది ఇప్ప‌టికే ఐదు సినిమాల స‌క్సెస్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద నిర్మాత‌గా ..త‌న సెల‌క్ష‌న్ ఆఫ్ మూవీస్ గురించి చెప్ప‌క‌నే చెప్పిన దిల్‌రాజు..ఇదే ఏడాది విడుద‌ల కానున్న 'ఎం.సి.ఎ' చిత్రంతో డ‌బుల్ హ్యాట్రిక్‌ను సాధించ‌నున్నారు.

మ‌హేష్ సినిమా అప్‌డేట్స్‌...

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'భ‌ర‌త్ అను నేను'(రిజిష్ట‌ర్డ్ టైటిల్‌). డివివి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 27న విడుద‌ల చేస్తున్నారు.