నిహారిక వెడ్డింగ్ కార్డ్..ఎలా ఉందంటే!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాబ్రదర్ నాగబాబు కొణిదెల కుమార్తె నిహారిక కొణిదెల వివాహాన్ని, గుంటూ ఐజీ ప్రభాకర్ రావు తనయుడు వెంకట చైతన్యతో జరగనున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్‌లో వీరి నిశ్చితార్థం జరిగింది. పెళ్లి కూడా ఇదే ఏడాదిలోనే చేసేస్తామని నాగబాబు చెప్పారు. అన్నట్లుగానే చైతన్య, నిహారికల పెళ్లి డిసెంబర్ 9, రాత్రి 7 గంటల 15 నిమిషాలకు జరగనుంది. ఇప్పుడు మెగా కుటుంబానికి చెందిన పెళ్లి పత్రిక నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పెళ్లి కార్డ్ ఖరీదైనది కాకుండా.. సింపుల్‌గా, చక్కగా ఉంది. కార్డ్‌పై మెగా ఫ్యామిలీ సభ్యులైన చిరంజీవి, పవన్‌కల్యాణ్, చరణ్ పేర్లు ఉన్నాయి. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరగనుంది. పెళ్లికి మెగా ఫ్యామిలీ అంతా కదిలి వెళ్లనుంది. హైదరాబాద్‌లోని సినీ ప్రముఖులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు డిసెంబర్ 11న జె.ఆర్.సి. కన్వెన్షన్‌లో రిసెస్ఫన్ను ఇవ్వబోతున్నారట. పెళ్లి పనులను వరుణ్‌తేజ్ దగ్గరుండి పర్యవేక్షిస్తుండగా.. నిహారిక కూడా రీసెంట్గా వెళ్లి పెళ్లి పనులను ఎలా జరుగుతున్నాయో చూసుకుంది.
కోవిడ్ ప్రభావ సమయంలో నితిన్, రానా, నిఖిల్ సహా మరికొంత మంది సినీ ప్రముఖులు పెళ్లిని చాలా సింపుల్‌గానే చేసుకున్నారు. కానీ మెగా కుటుంబం మాత్రం నిహారిక పెళ్లిని డెస్టినేషన్ మ్యారేజ్‌గా గ్రాండ్‌గా చేస్తున్నారు. ముద్దపప్పు అవకాయ్ వెబ్ సిరీస్‌తో మంచి పేరు సంపాదించుకున్న నిహారిక ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. ఈమె చేసిన ‘సూర్యకాంతం’, అంతకు ముందే విజయ్ సేతుపతి, గౌతమ్ కార్తీక్‌లతో ఓ తమిళ సినిమా హీరోయిన్గా పేరుని తెచ్చిపెట్టలేదు. చిరంజీవి టైటిల్ పాత్రలో నటించిన ‘సైరా నరసింహారెడ్డి’లో ఓ చిన్న పాత్రలో కనిపించింది నిహారిక.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments