నిహారిక పెళ్లి.. ప్రకటన రేపే?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక కొణిదెల త్వరలోనే పెళ్లి చేసుకోనుందని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముద్దపప్పు అవకాయ్ వెబ్ సిరీస్‌తో మంచి పేరు సంపాదించుకున్న నిహారిక ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. ఈమె చేసిన ‘సూర్యకాంతం’, అంతకు ముందే విజయ్ సేతుపతి, గౌతమ్ కార్తీక్‌లతో ఓ తమిళ సినిమాలో నటించింది నిహారిక. అయితే హీరోయిన్గా ఈ అమ్మడుకి సక్సెస్ దక్కలేదు. ‘సైరా నరసింహారెడ్డి’లో ఓ చిన్న పాత్రలో కనిపించింది. ఓ తమిళ చిత్రంలో నటించబోతుందంటూ వార్తలు వినపిస్తున్నాయి.
అయితే రీసెంట్గా కొన్ని ఇంటర్వ్యూస్‌లో నిహారిక పెళ్లిని రెండు, మూడేళ్లలో చేస్తామని నాగబాబు తెలిపారు. అన్నట్లుగానే నాగబాబు ఇప్పుడు నిహారిక పెళ్లిని గుంటూరు అబ్బాయితో ఖరారు చేశారని, ముహూర్తాలు కూడా పెట్టేశారని వార్తలు వినపడుతున్నాయి. అంతా కుదిరితే వచ్చే ఏడాది నిహారిక పెళ్లి జరుగుతుందని కూడా సమాచారం. రేపే నిహారిక పెళ్లికి సంబంధించిన వార్త అధికారికంగా ప్రకటించబోతున్నారని కూడా వార్తలు వినపడుతున్నాయి. మరి ఈ వార్తలపై నాగబాబు ఇతరులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com