త‌మిళ్ సినిమాలో నిహారిక ఫ‌స్ట్‌లుక్

  • IndiaGlitz, [Friday,November 17 2017]

గ‌తేడాది విడుద‌లైన ఒక మ‌నసుతో క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె కొణిదెల నిహారిక‌. ఆ సినిమాతో న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ మెగా ప్రిన్సెస్‌.. ప్ర‌స్తుతం యువ క‌థానాయ‌కుడు సుమంత్ అశ్విన్‌తో హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమా చేస్తోంది.

అలాగే త‌మిళంలోనూ ఓ సినిమా చేస్తోంది. అక్క‌డ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన‌ విజ‌య్ సేతుప‌తి ఇందులో హీరోగా న‌టిస్తున్నాడు. ఒరు న‌ల్ల నాళ్ పార్తు సొల్‌రేన్ అనే పేరుతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో గౌత‌మ్ కార్తీక్ మ‌రో హీరోగా న‌టిస్తున్నాడు. అరుముగ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కాగా ఈ రోజు చిత్ర బృందం నిహారిక ఫ‌స్ట్‌లుక్‌ని విడుద‌ల చేసింది.

ఇందులో సౌమ్య అలియాస్‌ అభ‌య ల‌క్ష్మీ పాత్ర‌లో క‌నిపించ‌నుంది నిహారిక‌. ప్ర‌స్తుతం నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఈ సినిమా.. త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. తెలుగులో తొలి చిత్రంతో ఆశించిన విజ‌యం అందుకోలేక‌పోయిన నిహారిక‌.. త‌మిళంలో అయినా తొలి సినిమాతో మంచి విజ‌యాన్ని అందుకుంటుందేమో చూడాలి.