'సూర్యకాంతం' డామినేషన్‌తో చంపేసిందిగా..!
Send us your feedback to audioarticles@vaarta.com
ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్, మెగా డాటర్ నిహారిక నటీనటులుగా హీరోగా.. దర్శకుడు ప్రణీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సూర్యకాంతం’. ఈ మూవీని సందీప్ ఎర్రమ రెడ్డి నిర్మిసుండగా.. రాబిన్ మార్క్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయగా.. ముందుగా అనుకున్న టైమ్‌కే టీజర్‌ను రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్‌లుక్‌తోనే ఆకట్టుకున్న ‘సూర్యకాంతం’ టీజర్‌తో అదుర్స్ అనిపించింది. రిలీజ్ అయిన కొద్దిసేపటికే పదివేలకు పైగా వ్యూస్.. పెద్ద ఎత్తున కామెంట్స్ రావడం విశేషం.
డైలాగ్స్.. అదుర్స్!
నీ పేరేంటని అని హీరో అడగ్గా.. టక్కున హీరోయిన్ స్పందించి.. ‘పేరు తెలుసుకుని ఏం చేసుకుంటావ్ రేపొద్దున నీకు పుట్టబోయే పిల్లలకు పెట్టుకుంటావా..!.’ ఆ తర్వాత నీ గురించి చెప్పు అని హీరోయిన్ అడగటం.. ఆయనేమో పేరు చెప్పి కంటిన్యూ చేయబోతుండగా ‘చాల్లే ఈ మాత్రం ఇంతకు మించి తెలుసుకుని ఏం చేస్తా’మని డైలాగ్ సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంటోంది. ‘హే వావ్.. తినడానికి పునుగులు లేవ్ గానీ.. బెగ్గర్‌కు బర్గర్ తినిపిస్తాడంట నీలాంటోడు’ అని నిహారిక డైలాగ్స్ అదరొట్టిందని చెప్పుకోవచ్చు.
టీజర్ రివ్యూ..!
‘సూర్యకాంతం’లోని డైలాగ్స్ జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. టీజర్ మొత్తమ్మీద నిహారిక డామినేషన్‌తో చంపేసింది.!. టీజర్లోనే ఇలా ఉంటే ఇక సినిమా మొత్తమ్మీద హీరోయిన్‌దే మొత్తం డామినేషన్ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదేమో అనిపిస్తోంది. అయితే ఈ డైలాగ్స్ రొటీన్‌గా ‘జబర్దస్త్’ షోలో మాదిరిగా ఉన్నాయే తప్ప కొత్తదనమేమీ లేదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టీవీ షోలో పంచ్ డైలాగ్సే.. మళ్లీ సినిమాల్లో కూడా పంచ్ డైలాగ్సా..? అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మొత్తానికి చూస్తే.. ఇప్పటి వరకూ నిహారిక నటించిన ‘ఒక మనసు’, ‘హ్యాపి వెడ్డింగ్’ చిత్రాలతో అభిమానులను పలకరించినప్పటికీ ఆశించినంతగా విజయాన్ని మాత్రం ఇవ్వలేదు. దీంతో ఈ సారి కచ్చితంగా హిట్ పడాల్సిందేనని ‘సూర్యకాంతం’ రూపంలో మెగాభిమానులు, సినీ ప్రియులను ప్రేక్షకులను పలకరించేందుకు నిహారిక సిద్ధమైంది. కాగా ఈ మూవీని మార్చిలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ సినిమా అయినా నిహారిక కలిస్తుందో లేదో తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments