తనకు కాబోయే భర్త ఫోటోను రివీల్ చేసిన మెగా డాటర్
Send us your feedback to audioarticles@vaarta.com
గత కొంతకాలంగా మెగా డాటర్ నిహారిక పెళ్లి విషయంలో ఎన్నో రూమర్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నిహారిక పెళ్లి ఆమె బావ సాయి తేజ్‌తో జరగబోతోందని ఒకసారి.. ప్రభాస్‌తో నిశ్చయమైందని మరోసారి రూమర్స్ హల్చల్ చేశాయి. కానీ అన్ని రూమర్స్‌కి చెక్ పెడుతూ అమ్మడు తన కాబోయే భర్త ఫోటోతో ఇన్‌స్టా గ్రాంలో దర్శనమిచ్చింది. గురువారం ఓ కంటైనర్‌పై ‘మిసెస్ నిహా’ అని రాసి ఉన్న పిక్‌ను పోస్ట్ చేసి సస్పెన్స్ క్రియేట్ చేసిన అమ్మడు.. సాయింత్రానికి తనకు కాబోయే భర్తను కౌగిలించుకుని ఉన్న ఫోటోను పోస్ట్ చేసి షాకిచ్చింది. అయితే ఆ ఫోటోలో కూడా కాస్త సస్పెన్స్‌ను మెయిన్టైన్ చేసింది. తన కాబోయే భర్త ఫేస్‌ని మాత్రం రివీల్ కానివ్వలేదు.
ఈ రోజు ఉదయం మరో ఫోటోను `మైన్` అని కామెంట్‌తో నిహారిక పోస్ట్ చేసింది. ఈ ఫోటో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షన్నరకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది. కాగా.. నిహారికకు ఆమె తండ్రి ఓ సంప్రదాయ కుటుంబం నుంచి వరున్ని వెతికినట్టు తెలుస్తోంది. అతని పేరు జొన్నలగడ్డ వెంకట చైతన్యగా తెలుస్తోంది. ఓ ఎమ్ఎన్సీ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న చైతన్య.. గుంటూరు ఐజీ కుమారుడని సమాచారం. అయితే టిక్‌టాక్‌లో ఈ జంట ముఖాలు పూర్తిగా కనిపించే ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com