ప్రభాస్‌తో పెళ్లిపై పెదవి విప్పిన నిహారిక..
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. మెగా వారసురాలు నిహారిక కొణిదెల పెళ్లి చేసుకోబోతున్నారని అప్పట్లో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో.. మీడియాలో వార్తలు వచ్చిన విషయం విదితమే. ఈ పుకార్లను ప్రభాస్ ఫ్యామిలీ నుంచి ఖండించినప్పటికీ ఇంతవరకూ మెగా ఫ్యామిలీ మాత్రం స్పందించలేదు. అయితే తాజాగా.. సోషల్ మీడియా వేదికగా తన సినిమాలు, పెళ్లి పుకార్లపై నిహారికే స్వయంగా క్లారిటీ ఇచ్చుకుంది. మీరు నిజంగానే ప్రభాస్‌ను ప్రేమించారని.. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని టాక్ నడిచింది ఇందులో నిజమెంత..? అని ఓ మెగాభిమాని అడగ్గా ఆమె ఎలా రియాక్ట్ అయ్యిందో ఇప్పుడు చూద్దాం.
ఎట్టకేలకు క్లారిటీ..
‘నేను ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవడం ఏంటి..? అసలు ఆయనెక్కడ..? నేనెక్కడ. అవన్నీ పుకార్లే ఎవరూ పట్టించుకోకండి. ఇలాంటి రూమర్స్ ఎలా వస్తాయో..? ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. గతంలో కూడా సాయి ధరమ్ తేజ్‌తో పెళ్లి అంటూ కూడా రూమర్స్ వచ్చాయి. దయచేసి ఎవరూ నమ్మకండి. నా ఫ్యామిలీలో అందరూ నాతో చాలా కూల్‌గా.. క్లోజ్‌గా ఉంటారు. అన్నయ్య వరుణ్ తేజ్ కాకుండా చరణ్ అంటే నాకు చాలా ఇష్టం. సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ నన్ను ఆట పట్టిస్తుంటారు. శ్రీజ నాకు బెస్ట్ ఫ్రెండ్. స్నేహా రెడ్డి కూడా నాతో చాలా క్లోజ్‌గా ఉంటుంది’ అని నిహారిక చెప్పుకొచ్చింది.
కాగా.. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల్లో నటిస్తారా? అని ప్రశ్నించగా.. ‘నేను సమంతను కాదు కాబట్టి.. పెళ్లి తర్వాత నటిస్తానా? లేదా?’ అని ముందే చెప్పలేను అని సమాధానమిచ్చింది. కాగా.. మెగా ఫ్యామిలీ నుంచి డజను మంది హీరోలు సినిమాల్లో సక్సెస్ అయినప్పటికీ నిహారిక మాత్రం సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లకు మాత్రమే నిహారిక పరిమితమైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments