నీహారిక రాజకీయగురువు
Send us your feedback to audioarticles@vaarta.com
ఎవరూ అన్నిట్లో పండితులై ఉండరు. కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు నేర్చుకుంటుంటారు. కొణిదెల ఆడపడుచు నీహారిక కూడా అలాంటిదే. జీవితంలో ఆమె దేన్నీ హాఫ్ మైండ్‌తో స్టార్ట్ చేయదు. ఎండ్ చేయదు. ఏం చేసినా తను ఫుల్ హార్ట్ ని పెట్టే చేస్తుంది. త్వరలో తన నాన్న నాగబాబు ఎంపీగా పోటీచేస్తున్న నర్సాపురం నియోజకవర్గంలో నీహారిక ప్రచారం చేయనుంది.
ఇప్పటిదాకా అడపాదడపా షూటింగ్‌లకు తప్ప, ఎండకన్నెరగని ఈ అమ్మాయి ఎన్నికల వేడిలోకి దూకనుంది. పోనీ అమ్మాయికి అంత పొలిటికల్ నాలెడ్జ్ ఉందా? అంటే నేర్చుకుంటోందట. ఆమెకు పొలిటికల్‌గా ఆమె ఫ్రెండ్ భర్త వివేక్ అన్ని విషయాలను నేర్పుతున్నారట.
నర్సాపురంలోనూ తాను తన వివేక్ అన్నతో కలిసి ప్రచారం చేయనున్నట్టు చెబుతుంది నీహారిక. అన్నట్టు నీహారికకు అక్కడ ఓటు లేదు. తెలంగాణలోనే ఉంది. అందుకే అక్కడ తనకు తెలిసిన వాళ్లందరినీ జనసేనకు సపోర్ట్ చేయమని బతిమలాడుతోందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout