మరోసారి పెద్దనాన్న సినిమాలో...?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి సోదరుడు మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక కొన్ని వెబ్ సిరీస్‌ల్లో నటించిన తర్వాత హీరో్యిన్‌గా కూడా కొన్ని సినిమాలు చేసింది. అయితే హీరోయిన్‌గా నిహారిక సక్సెస్ కాలేదనే చెప్పాలి. ఈ విషయాన్ని పక్కన పెడితే నిహారిక హీరోయిన్‌గా సక్సెస్ కావాల్సిన అవసరం లేదు. ఏదో ఆమెకు నచ్చినంత కాలం, నచ్చిన సినిమాలు చేసుకుంటే పోతే చాలు అని మెగా క్యాంప్ అనుకుంటుంది. అందులో భాగంగా నిహారిక సైరా నరసింహారెడ్డి చిత్రంలో ఓ చిన్న పాత్రలో మాత్రం నటించింది. తర్వాత మరో సినిమా చేయలేదు.
లేటెస్ట్ సమాచారం మేరకు చిరంజీవి 152వ చిత్రం ఆచార్యలో నిహారిక మరోసారి నటిస్తుందని వార్తలు వినపడుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నిహారిక పాత్ర ఉందా? లేదా? ఉంటే ఆమె పాత్ర ఎలా ఉండబోతుంది అనే విషయాలపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఆగస్ట్ 14న విడుదల కావాల్సిన ఆచార్య కరోనా వైరస్ ప్రభావంతో షూటింగ్ ఆగిపోయింది. దీంతో విడుదల కూడా వాయిదా పడింది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఆచార్య సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కూడా నటిస్తున్నారు. చరణ్ ఓ నక్సలైట్ పాత్రలో కనపడతాడని సమాచారం. కమర్షియల్ సినిమాలను మెసేజ్ మిక్స్ చేసి సినిమాలన తెరకెక్కించే దర్శకుడు కొరటాల శివ తమ అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవిని ఎలా చూపించనున్నారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com