నిహారిక నెక్ట్స్ మూవీ ఫిక్స్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా ఫ్యామిలీ నుంచి ఫస్ట్ టైమ్ హీరోయిన్ గా నాగబాబు కుమార్తె నిహారిక ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఫస్ట్ మూవీతో కమర్షియల్ సక్సెస్ సాధించకపోయినా...నటిగా మంచి గుర్తింపు ఏర్పరుచుకుంది. అయితే...నిహారిక తదుపరి చిత్రం గురించి ఇప్పటి వరకు ఎలాంటి వార్తలు బయటకు రాలేదు. దానికి కారణం కంగారుపడి ఏదో ఒక సినిమా చేయడం కాకుండా పర్ ఫార్మెన్స్ స్కోప్ ఉన్న వైవిధ్యమైన సినిమా చేయాలనుకుంటుందట.
అందుకే నిహారిక నెక్ట్స్ మూవీ ఎనౌన్స్ చేయలేదని టాక్. ఇదిలా ఉంటే...నిహారిక ఇటీవల ఓ కథ విని ఓకే చెప్పిందట. ఈ కథను నాగబాబు కూడా విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ చిత్రం ద్వారా కార్తీక్ దర్శకుడిగా పరిచయం కానున్నారు.ఈ చిత్రంలో పెళ్లిచూపులు హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడని తెలిసింది. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి....ఈ సినిమాతో నిహారిక నటిగా మరింత గుర్తింపుతో పాటు కమర్షియల్ సక్సెస్ కూడా సాధిస్తుందని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com