త‌మిళ హీరోతో మెగాడాట‌ర్‌

  • IndiaGlitz, [Monday,May 04 2020]

మెగా బ్ర‌ద‌ర్ త‌న‌య నిహారిక కొణిదెల ఒక మ‌న‌సు సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైంది. ఈమె చేసిన సూర్య‌కాంతం, అంత‌కు ముందే విజ‌య్ సేతుప‌తి, గౌత‌మ్ కార్తీక్‌ల‌తో ఓ త‌మిళ సినిమాలో న‌టించింది నిహారిక‌. అయితే హీరోయిన్‌గా ఈ అమ్మ‌డుకి స‌క్సెస్ ద‌క్కలేదు. సైరా న‌ర‌సింహారెడ్డిలో ఓ చిన్న పాత్ర‌లో క‌నిపించింది. దాదాపు ఏడాది త‌ర్వాత హీరోయిన్‌గా సినిమాను ఓకే చేసింది నిహారిక‌. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. అశోక్ సెల్వ‌న్ క‌థానాయ‌కుడిగా ఈ సినిమా రూపొంద‌నుంది. కెన‌న్య ఫిలింస్ బ్యాన‌ర్‌పై స్వాతిని ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమా రూపొంద‌నుంది. తాను ఎంతో ఆస‌క్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాన‌ని కూడా నిహారిక తెలియ‌జేసింది.

క్వారంటైన్ స‌మ‌యంలో నిహారిక కొణిదెల సోష‌ల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉంది. త‌న‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోల‌ను అప్‌లోడ్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోనూ చాటింగ్ చేశారు. రామ్‌చ‌ర‌ణ్ చెల్లెలుగా ఆచార్య సినిమాలో కనిపించ‌బోతున్నాన‌నే వార్త‌ల‌పై నిహారిక స్పందించారు. తాను చ‌ర‌ణ్ అన్న‌య్య‌తో క‌లిసి చేయ‌డం లేద‌ని, అవ‌న్నీ పుకార్లేన‌ని చెప్పేశారు.