నిహారిక సినిమా పూర్తయ్యింది

  • IndiaGlitz, [Friday,January 12 2018]

మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక ఒక మ‌న‌సు చిత్రంతో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ హ్యాపీ వెడ్డింగ్' అనే సినిమా చేస్తోంది. తన మొదటి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినంత విజయం సాధించకపోవడంతో.. కొంత గ్యాప్ తీసుకుని ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నిహారిక‌. ఇటీవ‌లే లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ హ్యాపీ వెడ్డింగ్'.. తాజాగా చిత్రీకరణని కూడా పూర్తిచేసుకున్నట్టు సమాచారం.

ఈ చిత్రంలో నిహారిక‌కి జోడిగా సుమంత్ అశ్విన్ నటించాడు. ఈ చిత్రంతో లక్ష్మణ్ కార్య డైరెక్టరుగా పరిచయం కానున్నాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ ఫ్యామిలీ లవ్ స్టోరీకి టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా...బాల్ రెడ్డి ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు. ఈ ఏడాది ప్ర‌థ‌మార్థంలో ఈ సినిమా తెర‌పైకి రానుంది. ఈ సినిమా ఇటు నిహారిక, అటు సుమంత్ కెరీర్ల పరంగా ఎంతో కీలకమనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. ఒరు నాల్ల నాల్ పాతు సోల్రెన్' అనే తమిళ మూవీలో కూడా నిహారిక నటిస్తోంది. విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

More News

వేసవిలో విజయ్ సందడి

పెళ్ళి చూపులుతో సోలో హీరోగా తొలి విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ..

సూపర్‌స్టార్‌ కృష్ణ 'అసాధ్యుడు' చిత్రానికి 50 వసంతాలు

సూపర్‌స్టార్‌ కృష్ణ హీరోగా నటించిన సూపర్‌హిట్‌ చిత్రం 'అసాధ్యుడు' 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. టైగర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వి.రామచంద్రరావు దర్శకత్వంలో నెల్లూరు కాంతారావు, ఎస్‌.హెచ్‌.హుస్సేన్మ్‌ నిర్మించిన ఈ చిత్రం జనవరి 12, 1968న విడుదలైంది. హీరోగా మంచి ఇమేజ్‌ తీసుకొచ్చిన 'గూఢచారి 116' చిత్రం తర్వాత సూపర్‌స్టార్‌ కృష్ణ చేసిన సినిమ&#

ల‌ఘు చిత్రాల్లో స్టార్స్‌...

ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న‌లు పెంపొందించుట‌కు పోలీసు విభాగం ల‌ఘు చిత్రాలు చేస్తుంది. ఈ ల‌ఘ‌చిత్రాల్లో టాలీవుడ్‌కు చెందిన ప్ర‌ముఖులు న‌టించారు. వారిలో ముఖ్యంగా ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, అర్జున్ రెడ్డితో యూత్‌లో క్రేజ్‌ను సంపాదించుకున్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

వి.వి వినాయక్ చేతులమీదుగా 'ఇంతలో ఎన్నెన్ని వింతలో' ధియేటరికల్ ట్రైలర్ విడుదల

నందు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇంతలో ఎన్నెన్ని వింతలో.

తరుణ్ భాస్కర్ తదుపరి ఏంటంటే...?

పెళ్ళిచూపులు సినిమాతో డైరెక్టర్ తో పేరు తెచ్చుకన్నాడు తరుణ్ భాస్కర్.