చిరంజీవి సినిమాలో నిహారిక...?

  • IndiaGlitz, [Wednesday,August 31 2016]

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా, ప్రెస్టిజియ‌స్ 150 మూవీ 'ఖైదీ నంబ‌ర్ 150' సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. నిన్న చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్బంగా విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై రాంచ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. త‌మిళ చిత్రం క‌త్తి కు రీమేక్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో త‌రుణ్ అరోరా విల‌న్‌గా న‌టిస్తుంటే కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

ఈ చిత్రంలో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక ఓ కీలకపాత్రలో కనిపిస్తుందని వార్తలు వినపడుతున్నాయి. ఒక మనసు చిత్రంలో హీరోయిన్ గా కనిపించిన నిహారిక మరో పంజాబ్ రీమేక్ లో నటించబోతుంది. కాగా పెద నాన్న చిరంజీవి చిత్రంలో ఎలాంటి పాత్రలో కనిపిస్తుందో చూడాలి. సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

నందుతో రష్మీ....

బుల్లితెర నుండి వెండితెరపైకి వచ్చిన రష్మీ తన గ్లామర్ తో మంచి అవకాశాలనే అందిపుచ్చుకుంటుంది.

'జ్యో అచ్యుతానంద' సెన్సార్ పూర్తి

నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా కసండ్ర హీరో హీరోయిన్లుగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయికొర్రపాటి నిర్మించిన చిత్రం `జ్యో అచ్యుతానంద`.

మురుగదాస్ ఆ విషయంలో క్లారిటీ ఇచ్చాడు

సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎ.ఆర్.మురుగదాస్ చేస్తున్న సినిమా హైదరాబాద్ చిత్రీకరణ జరుపుకుంటుంది. వంద కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో తెరకెక్కిస్తారట.

భూమిని ఇష్టపడే విద్యార్ధి - మనుషులను ఇష్టపడే ఓ పెద్దాయన వీరిద్దరూ కలిస్తే జనతా గ్యారేజ్

మిర్చి, శ్రీమంతుడు చిత్రాలతో వరుసగా బ్లాక్ బష్టర్స్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ కొరటాల శివ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో బ్లాక్ బష్టర్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం జనతా గ్యారేజ్.

నందినీ రెడ్డితో విజయ్ దేవరకొండ

అలా మొదలైంది చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి రీసెంట్ గా కల్యాణ వైభోగమే చిత్రంతో కూడా మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.