వైభవంగా నిహారిక పెళ్లి.. నాగబాబు భావోద్వేగం..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది అతిథుల సమక్షంలో నిహారిక.. జొన్నలగడ్డ చైతన్యతో ఏడడుగులు వేసింది. ఈ పెళ్లి వేడుకకు రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో ఉదయ్ విలాస్ హోటల్ వేదికగా మారింది. గత వారం రోజులుగా ఈ పెళ్లి వేడుకలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇరువైపుల కుటుంబ సభ్యులు ఉదయ్‌పూర్ చేరుకున్నప్పటి నుంచి ఈ పెళ్లి వేడుకకు మరింత జోష్ వచ్చింది.
నాగబాబుకు కూతురు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన పలు సందర్భాల్లో ఈ విషయం గురించి మాట్లాడారు. తన ముద్దుల కూతురు వివాహం జరిగిన సందర్భంగా నాగబాబు భావోద్వేగానికి లోనయ్యారు. ట్విటర్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘‘నేను మరోసారి తీవ్ర ఆవేదనకు గురయ్యాను. ఇది ఆమె స్కూలుకు వెళ్లిన మొదటి రోజులా అనిపిస్తోంది అయితే తను సాయంత్రానికి తిరిగి రాదు. నా చిన్నారి కూతురు స్కూలుకు వెళ్లేంత పెద్దదై పోయిందనే నిజం నమ్మడానికే నాకు చాలా ఏళ్లు పట్టింది. ఈసారి ఇంకెన్నాళ్లు పడుతుందో.. కాలమే నిర్ణయిస్తుంది’’ అని నాగబాబు ట్వీట్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments