నిహారిక ఎంగేజ్‌మెంట్ ఫిక్స్‌

  • IndiaGlitz, [Wednesday,July 29 2020]

మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె నిహారిక పెళ్లి ఈ ఏడాదిలో జ‌ర‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని మెగా ఫ్యామిలీతో పాటు నిహారిక కూడా సోష‌ల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇప్పుడు నిహారిక ఎంగేజ్‌మెంట్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చింది. ఇంత‌కూ ఈ క్లారిటీ ఇచ్చింది ఎవ‌రో కాదు.. హీరో, నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్‌తేజ్‌. రీసెంట్ ఇంట‌ర్వ్యూలో వ‌రుణ్ తేజ్ మాట్లాడుతూ నిహారిక ఎంగేజ్‌మెంట్ ఆగ‌స్ట్ 13న ప‌రిమిత సంఖ్య‌లో ప్ర‌భుత్వ క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ విధి విధానాల మేర‌కు జ‌రుగుతుంద‌ని తెలిపారు. పెళ్లి డిసెంబ‌ర్‌లో జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు మాత్రం వినిపిస్తున్నాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐజీ ప్ర‌భాక‌ర్ రావు జొన్న‌ల‌గ‌డ్డ త‌న‌యుడు చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌తో జ‌ర‌గ‌నుంది. చైత‌న్య టెక్ మ‌హీంద్రాలో ఎగ్జిక్యూటివ్ హోదా జాబ్ చేస్తున్నారు. రీసెంట్‌గా కూడా చైత‌న్య పుట్టిన‌రోజుకు నిహారిక అభినంద‌న‌లు తెలియ‌జేస్తూ ఓ క‌విత‌ను కూడా రాసింది. ముద్దపప్పు అవకాయ్ వెబ్ సిరీస్‌తో మంచి పేరు సంపాదించుకున్న నిహారిక ‘ఒక మ‌న‌సు’ సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైంది. ఈమె చేసిన ‘సూర్య‌కాంతం’, అంత‌కు ముందే విజ‌య్ సేతుప‌తి, గౌత‌మ్ కార్తీక్‌ల‌తో ఓ త‌మిళ సినిమాలో న‌టించింది నిహారిక‌. అయితే హీరోయిన్‌గా ఈ అమ్మ‌డుకి స‌క్సెస్ ద‌క్కలేదు. ‘సైరా న‌ర‌సింహారెడ్డి’లో ఓ చిన్న పాత్ర‌లో క‌నిపించింది. ఓ త‌మిళ చిత్రంలో న‌టించ‌బోతుందంటూ వార్త‌లు విన‌పిస్తున్నాయి. .

More News

శివాజీ రాజా తనయుడు విజయ్ రాజు నూతన చిత్రం ప్రారంభం

జయ దుర్గ దేవి మల్టీ మీడియా పతాకం పై శివాజీ రాజా గారి అబ్బాయి విజయ్ రాజు మరియు తమన్నా వ్యాస్ హీరో హీరోయిన్ గా రామ్స్ రాథోడ్ దర్శకత్వం లో

ఆర్జీవీకి షాక్‌!!

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు ఆర్జీవీ లాక్‌డౌన్ స‌మ‌యంలో వ‌రుస సినిమాలు చేస్తూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

అయోధ్యలో హై అలెర్ట్.. ఉగ్రదాడికి కుట్ర!

ఆయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఆగస్ట్ 5న భూమిపూజ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తొలి ఇటుకను ప్రధాని మోదీ అందించనున్నారు.

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'  రొమాంటిక్ పోస్టర్ విడుదల

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న చిత్రం "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్".

వెంటిలేటర్‌పై ఐదేళ్ల పాప.. యూనిట్ రక్తం.. ప్రపంచమంతా గాలించారు.. చివరకు..

వెంటిలేటర్‌పై ఐదేళ్ల చిన్నారి.. ఎలాగైనా బతికించాలనే తాపత్రయం.. కనీసం ఒక్క యూనిట్ బ్లడ్ దొరికినా చాలు..