నిహారిక డెస్టినేషన్ పెళ్లి...!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాబ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి ఈ ఏడాదిలో జరనుందనే వార్తలు ఆమె ఎంగేజ్మెంట్ సమయంలో వినిపించాయి. కోవిడ్ సమయంలో ఆగస్ట్ 13న పరిమిత సంఖ్యలో హాజరైన బంధుమిత్రుల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ఐజీ ప్రభాకర్ రావు జొన్నలగడ్డ తనయుడు చైతన్య జొన్నలగడ్డతో జరిగిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం మేరకు నిహారిక, చైతన్య పెళ్లి డిసెంబర్లో చేయబోతున్నారట. కోవిడ్ సమయంలో పెళ్లి చేసుకున్న సినీ సెలబ్రిటీలు చాలా సింపుల్‌గా పెళ్లి తంతును ముగించిన సంగతి తెలిసిందే. కానీ నిహారికకు మాత్రం డెస్టినేషన్ వెడ్డింగ్నే ప్లాన్ చేశామని నాగబాబు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. . సమాచారం మేరకు డిసెంబర్ నెలలో... రాజస్థాన్‌లో నిహారిక పెళ్లి జరుగుతుందని టాక్.
ముద్దపప్పు అవకాయ్ వెబ్ సిరీస్‌తో మంచి పేరు సంపాదించుకున్న నిహారిక ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. ఈమె చేసిన ‘సూర్యకాంతం’, అంతకు ముందే విజయ్ సేతుపతి, గౌతమ్ కార్తీక్‌లతో ఓ తమిళ సినిమాలో నటించింది నిహారిక. అయితే హీరోయిన్గా ఈ అమ్మడుకి సక్సెస్ దక్కలేదు. ‘సైరా నరసింహారెడ్డి’లో ఓ చిన్న పాత్రలో కనిపించింది. ఓ తమిళ చిత్రంలో నటించబోతుందంటూ వార్తలు వినపిస్తున్నాయి. .
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout