మెగా అల్లుడి సినిమా ఎంట్రీకి నో ఛాన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా ఫ్యామిలీలో లేటెస్ట్ ఎడిషన్ వెంకటచైతన్య జొన్నలగడ్డ. నాగబాబు కుమార్తె నిహారిక భర్త. మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. పెద్ద అల్లుడు విష్ణుప్రసాద్ 'షూట్ అవుట్ ఎట్ ఆలేరు' వెబ్ సిరీస్‌తో ప్రొడ్యూసర్ అయ్యాడు. నిహారిక భర్త హ్యాండ్సమ్గా ఉండటంతో హీరోగా ఎంట్రీ ఇస్తాడని ఫిలిం సర్కిళ్లలో టాక్ నడుస్తోంది. అటువంటిది ఏమీ లేదని నిహారిక క్లారిటీ ఇచ్చింది.
"ఆయనకు సినిమాలు చూడటమంటే ఇష్టం. యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు. ఆయనకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ పనుల్లో ఉన్నారు" అని నిహారిక చెప్పారు. 'మీకు సినిమాల్లోకి వచ్చే ప్లాన్స్ ఉన్నాయా?' అని చైతన్యను అడిగితే... "అస్సలు ఆ ఆలోచన లేదు" అని సమాధానం ఇచ్చారు. నిహారిక కూడా తామిద్దరం సినిమాలు చేసే ఛాన్స్ లేదని స్పష్టం చేశారు. సో... మెగా ఫ్యామిలీలో కొత్త అల్లుడి సినిమా ఇంట్రీకి నో ఛాన్స్ అన్నమాట.
మెగా ఫ్యామిలీ నుండి పవన్ కల్యాణ్ పిల్లలు సినిమాల్లోకి రావడమే బ్యాలన్స్. రేపో మాపో అకిరా హీరోగా వస్తాడని టాక్. అల్రెడీ చిరంజీవి, నాగబాబు పిల్లలు అందరూ వచ్చారు. అటు అల్లు ఫ్యామిలీలో పిల్లలు, మెగా మేనల్లుళ్లు కూడా. మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి తేజ్, అల్లు శిరీష్, పంజా వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ ధేవ్ హీరోలుగా వచ్చారు. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ, వరుణ్ తేజ్ 'గని' ప్రొడ్యూస్ చేస్తున్నాడు. చిరంజీవి పెద్ద అల్లుడు విష్ణుప్రసాద్ 'షూట్ అవుట్ ఎట్ ఆలేరు'తో ప్రొడ్యూసర్ గా మారాడు. చిరు పెద్ద కుమార్తె సుష్మిత స్టయిలిస్ట్. నిహారిక నటిగా కంటిన్యూ అవుతున్నారు. మెగాస్టార్ చిన్న కుమార్తె శ్రీజ మాత్రమే ఇండస్ట్రీలోకి రాలేదు. కానీ భర్త కళ్యాణ్ ధేవ్ను హీరోగా పంపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments