మండుటెండలో నేలపై కూర్చొన్న మహేష్ దర్శకుడు.. నెటిజన్ల ప్రశంసలు
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకుడిని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. సినిమా సక్సెస్ అయినా ఫ్లాప్ అయినా ఆయనపైనే ఆధారపడి ఉంటుంది. ఏ దర్శకుడైనా తన సినిమాను సక్సెస్ బాట పట్టించేందుకే తీవ్రంగా కృషి చేస్తూ ఉంటారు. దీని కోసం ఎంతో శ్రమిస్తుంటారు. సినిమా స్క్రిప్ట్ నుంచి థియేటర్లో రిలీజ్ అయ్యే వరకూ దర్శకుడి కష్టం అంతా ఇంతా కాదు. ప్రతి ఒక్క దర్శకుడికి తానేంటో ప్రూవ్ చేసుకునే తరుణం వస్తూ ఉంటుంది. అలాగే.. దర్శకుడు పరశురామ్‌కి ‘గీతగోవిందం’ రూపంలో వచ్చింది. ఈ సినిమాతో పరశురామ్ స్టార్ డైరెక్టర్ స్థాయికి చేరారు.
ఇప్పుడు ఏకంగా సూపర్‌స్టార్ మహేష్ బాబును డైరెక్ట్ చేసే ఛాన్స్ పట్టేశారు. మహేష్ హీరోగా భారీ బడ్జెట్‌తో `సర్కారు వారి పాట` చిత్రాన్ని పరుశురామ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. స్టార్ హీరోని తెరకెక్కించే అవకాశం దొరికిందిలే అని లైట్ తీసుకోకుండా చాలా శ్రమపడుతున్నారు. అక్కడ లొకేషన్లో తీసిన ఓ ఫొటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో మహేశ్‌బాబుకు ఆయన అసిస్టెంట్ గొడుగు పట్టుకుని ఉండగా.. మహేష్ నడుస్తూ వెళుతున్నాడు. ఆ పక్కనే కింద ఓ వ్యక్తి మండుటెండలో నేలపై కూర్చొని ఏదో రాసుకుంటున్నట్లు కనిపిస్తోంది.
అయితే, ఆ కింద కూర్చొని రాసుకుంటున్న వ్యక్తి దర్శకుడు పరశురామేనని నెటిజన్లు భావించారు. దీంతో ఈ ఫొటో కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారింది. స్టార్ హీరోను డైరెక్ట్ చేస్తున్నాననే గర్వం లేకుండా సింపుల్‌గా నేలపై కూర్చొని పని చేసుకుంటున్న పరశురామ్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం దుబాయ్‌లో ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com