తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం అందజేసిన నిధి
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా సెకండ్ వేవ్ కారణంగా పెద్ద ఎత్తున ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ఈ పరిస్థితిపై తమిళనాడుకు చెందిన సెలబ్రిటీలు స్పందించి ఈ విపత్తు నుంచి జనాన్ని గట్టెక్కించమని కోరుతూ సీఎం రిలీఫ్ ఫండ్‌కు పెద్ద మొత్తంలో విరాళాలు అందజేస్తున్నారు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ మురగదాస్, సూపర్ స్టార్ రజినీకాంత్ తదితరులు తమ వంతుగా సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు అందజేశారు. ఈ క్రమంలోనే తాజాగా తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు హీరోయిన్ నిధి అగర్వాల్ రూ.లక్ష విరాళం ప్రకటించారు.
అంతేకాకుండా దేశంలో ఖాళీగా ఉన్న కోవిడ్ పడక(బెడ్)ల సమాచారాన్ని 'ఫైండ్ ఏ బెడ్' పేరుతో బాధితులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఈ 'ఫైండ్ ఏ బెడ్'కు కాజ్ అంబాసిడర్‌గా నిధి ప్రచార సాయం కూడా నిర్వహిస్తోంది. ఇటీవలే రెండు తమిళ సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ముద్దుగుమ్మకు తమిళ అభిమానులు గుడి కూడా కట్టారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబినేషన్‌లో మెగా సూర్య బ్యానర్‌పై ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్న ‘హరిహర వీరమల్లు’లో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments