మీ వల్లే అత్యాచారాలంటూ హీరోయిన్‌పై కామెంట్.. ఆమె ఏం చేసిందంటే?
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమా అనేది గ్లామర్ ప్రపంచం మారుతున్న కాలానికి అనుగుణంగా మూవీ మేకింగ్‌లో చాలా మార్పులు వస్తున్నాయి. సినిమాల్లో హీరోయిన్స్ కూడా పాత్రల పరిధి మేర గ్లామర్ డోసు పెంచేస్తున్నారు. మరికొందరు హీరోయిన్స్ సినిమాల్లోనే కాకుండా తమ అందాలను సోషల్ మీడియాలోను చూపిస్తున్నారు.
నిధి అగర్వాల్ కూడా తన హాట్ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంటుంది. అలా ఈరోజు ఆమె చేసిన ఓ పోస్ట్ చూసిన నెటిజన్స్ ఆమెపై ఘాటుగా విమర్శ చేశాడు. ‘మీలాంటి వాళ్ల వల్లే సామాన్య అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. మీ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయకుండా సినిమాలకే పరిమితం చేయండి’ అంటూ కామెంట్ పెట్టాడు. దీనిపై నిధి అగర్వాల్ కూడా తనదైన స్టైల్లో ఘాటుగానే రిప్లై ఇచ్చింది. ‘ఈ వ్యక్తి ఆలోచనలు ఎంతో భయంకరంగా ఉన్నాయి. దయచేసి నాకు పంపితే మీకు పింక్ సినిమాను పంపుతాను. మీకు అది అవసరం’ అంటూ సమాధానం ఇచ్చింది.
సోషల్ మీడియాలోని అభిమానులు కూడా నిధి అగర్వాల్‌కే మద్దతుని తెలుపుతున్నారు. ‘పింక్'లాంటి సినిమాల వల్ల ఇలాంటి వ్యక్తుల ఆలోచనల్లో మార్పు రాదని కొందరు అంటున్నారు. రెండు రోజుల క్రితం వెటర్నరీ డాక్టర్‌ను నలుగురు రేప్ చేసి హత్య చేసిన తర్వాత ఇలాంటి డిస్కషన్ జరగడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయం సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతుంది.
Appalled at the catastrophic thinking of this individual. Naresh please send me your address, will send you this movie called Pink. You need it. https://t.co/bmKNdDg0zi
— Nidhhi Agerwal (@AgerwalNidhhi) November 30, 2019
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments