అలాంటి సాంగ్స్ లో నటించను.. నిధి అగర్వాల్ కు ఇలాంటి ఒపీనియన్ ఉందా!
Send us your feedback to audioarticles@vaarta.com
తన అందంతో కుర్రకారుని గిలిగింతలు పెట్టే హీరోయిన్ నిధి అగర్వాల్. మతి పోగొట్టే సోయగాలతో యువతని ఆకర్షిస్తున్న నిధి.. ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి అవకాశాలు అందుకుంటోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్ నటిస్తోంది. అలాగే అశోక్ గల్లా పక్కన 'హీరో' మూవీలో నటిస్తోంది.
ఈ అందాల నిధికి ఒక విచిత్రమైన ఒపీనియన్ ఉందట. తెలుగు సినిమాల్లో వాన పాటలకు ప్రత్యేక స్థానం ఉంది. కమర్షియల్ చిత్రాల సక్సెస్ లో వాన పాటలని దర్శకులు హిట్ ఫార్ములాగా భావిస్తారు. ఇక ఆడియన్స్ అయితే అలాంటి పాటలని ఎప్పుడూ ఆదరిస్తారు.
సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, రాంచరణ్ ఇలా ఎందరో హీరోలు, హీరోయిన్లు వాన పాటల్లో అలరించారు. కానీ నిధి అగర్వాల్ కి మాత్రం రైన్ సాంగ్స్ అంటే చిరాకట. రైన్ సాంగ్స్ లో నటించడం చాలా కష్టం అంటోంది నిధి. వాన పాటల్లో నటించేటప్పుడు ఒక షాట్ పూర్తయిన తర్వాత కొంతసేపు ఖాళీగా కూర్చోవాలి.
నెక్స్ట్ షాట్ లో మళ్ళీ వర్షంలో తడవాలి. వర్షపు చినుకులు ముఖంపై పడుతూ ఉన్నా హావభావాలు పలికించాలి. అలా చేయడం చాలా కష్టం. వర్షపు చినుకులు పడుతూ ఉంటె కళ్ళు తెరవడం అంత తేలిక కాదు. అందుకే రైన్ సాంగ్స్ అంటే చిరాకు. ఆ పాటలో నటించే ఉద్దేశం ఇప్పటికైతే లేదు అని నిధి అగర్వాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తేల్చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com