అలాంటి సాంగ్స్ లో నటించను.. నిధి అగర్వాల్ కు ఇలాంటి ఒపీనియన్ ఉందా!

  • IndiaGlitz, [Tuesday,July 27 2021]

తన అందంతో కుర్రకారుని గిలిగింతలు పెట్టే హీరోయిన్ నిధి అగర్వాల్. మతి పోగొట్టే సోయగాలతో యువతని ఆకర్షిస్తున్న నిధి.. ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి అవకాశాలు అందుకుంటోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్ నటిస్తోంది. అలాగే అశోక్ గల్లా పక్కన 'హీరో' మూవీలో నటిస్తోంది.

ఈ అందాల నిధికి ఒక విచిత్రమైన ఒపీనియన్ ఉందట. తెలుగు సినిమాల్లో వాన పాటలకు ప్రత్యేక స్థానం ఉంది. కమర్షియల్ చిత్రాల సక్సెస్ లో వాన పాటలని దర్శకులు హిట్ ఫార్ములాగా భావిస్తారు. ఇక ఆడియన్స్ అయితే అలాంటి పాటలని ఎప్పుడూ ఆదరిస్తారు.

సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, రాంచరణ్ ఇలా ఎందరో హీరోలు, హీరోయిన్లు వాన పాటల్లో అలరించారు. కానీ నిధి అగర్వాల్ కి మాత్రం రైన్ సాంగ్స్ అంటే చిరాకట. రైన్ సాంగ్స్ లో నటించడం చాలా కష్టం అంటోంది నిధి. వాన పాటల్లో నటించేటప్పుడు ఒక షాట్ పూర్తయిన తర్వాత కొంతసేపు ఖాళీగా కూర్చోవాలి.

నెక్స్ట్ షాట్ లో మళ్ళీ వర్షంలో తడవాలి. వర్షపు చినుకులు ముఖంపై పడుతూ ఉన్నా హావభావాలు పలికించాలి. అలా చేయడం చాలా కష్టం. వర్షపు చినుకులు పడుతూ ఉంటె కళ్ళు తెరవడం అంత తేలిక కాదు. అందుకే రైన్ సాంగ్స్ అంటే చిరాకు. ఆ పాటలో నటించే ఉద్దేశం ఇప్పటికైతే లేదు అని నిధి అగర్వాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తేల్చేసింది.

More News

తమిళ హీరో ఫస్ట్ తెలుగు మూవీ.. హీరోయిన్ గా రష్మిక మందన?

తమిళ హీరోలు ప్రస్తుతం తెలుగు దర్శకులతో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

కాబోయే భర్తతో అమీ జాక్సన్ బ్రేకప్.. అతడి ఫొటోలన్నీ డిలీట్!

అందాల బ్రిటిష్ తార అమీ జాక్సన్ ని సౌత్ ప్రేక్షకులు అంత త్వరగా మరచిపోలేరు. మతిపోగోట్టే సోయగాలు, క్యూట్ నటనతో ఆకట్టుకుంది.

పవన్ - రానా మూవీ మేకింగ్ వీడియో.. సర్ ప్రైజ్ అదిరింది!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆరడుగుల ఆజాను బాహుడు రానా దగ్గుబాటి కలసి మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

'వన్' ట్రైలర్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్లూరి చంద్రంగా మమ్ముట్టి

ఓటిటి రిలీజ్ తో పాటు, డబ్బింగ్ చిత్రాల ట్రెండ్ కూడా కొనసాగుతోంది. మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన వన్ చిత్రం ఈ ఏడాది మార్చిలో విడుదలై మంచి విజయం దక్కించుకుంది.

పవన్ - రానా మూవీ నుంచి స్పెషల్ ట్రీట్ నేడే!

సోమవారం రోజు పవన్- రానా మల్టీస్టారర్ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభం అయింది.