జగన్‌ పై దాడి కేసు: ఎన్ఐఏ గుట్టు విప్పబోతోందా..!

  • IndiaGlitz, [Tuesday,January 08 2019]

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు ఎన్‌‌ఐఏ చేతిలో ఉన్న సంగతి తెలిసిందే. తీవ్ర నాటకీయ పరిణామాల మధ్య ఈ కేసు ఎన్ఐఏకు చేరింది. ఎన్‌‌ఐఏ ఆధ్వర్యంలోకి రావడంతో రంగంలోకి దిగిన అధికారులు అసలేం జరిగింది..? ఈ కుట్ర వెనుక ఎవరున్నారు..? అసలు కారకులెవరు..? ఎవరి డైరెక్షన్‌లో ఇదంతా జరిగిందనే గుట్టును విప్పడానికి సుధీర్ఘంగా దర్యాప్తు చేస్తోంది.

ఈ క్రమంలో ఏపీ పోలీసులను కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలని అధికారులు కోరింది. అయితే ఏపీ పోలీసులు మాత్రం ఏ మాత్రం సహకరించడంతో మంగళవారం నాడు ఎన్ఐఏ కోర్టును ఆశ్రయించి ఈ వ్యవహారంపై మెమో దాఖలు చేసింది. ఈ కేసును హియరింగ్‌కు వస్తే విజయవాడ కోర్టుకు బదలాయించి.. నిందితుడు శ్రీనివాసరావును కస్టడీ కూడా కోరే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

శ్రీనివాసరావును విచారిస్తే పరిస్థితేంటి..!?

ఈ దాడి జరిగినప్పట్నుంచి జరిగిన పరిణామాలన్నీ అందరికీ గుర్తుండే ఉంటాయి. మరీ ముఖ్యంగా నిందితుడు శ్రీనివాసరావు పొంతనలేని సమాధానాలు చెప్పడం.. మరోవైపు తెలుగు తమ్ముళ్లు సైతం స్పందించిన తీరుతో తెలుగు ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. శ్రీనివాసరావును కస్టడీ తీసుకుంటే నిజానిజాలను అధికారులు నిగ్గు తేల్చుతురా..? అసలేం జరిగిందనే విషయాలన్నీ బయటపడతాయ్.. ఎన్ఐఏ గుట్టు విప్పుతుందనే వైసీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ నెల చివరికల్లా ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

More News

టీడీపీకి షాక్.. జగన్ సమక్షంలో వైసీపీలోకి బుద్ధా..!

ఆంధ్రప్రదేశ్‌‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో నేతలు జంపింగ్‌‌లు చేస్తున్నారు. ఏ పార్టీ అయితే తమను గుర్తించి సముచిత స్థానం కల్పిస్తుందో అక్కడికెళ్లి వాలిపోతున్నారు.

వైఎస్ జగన్‌‌కు సడన్ షాకిచ్చిన సూపర్‌స్టార్ ఫ్యామిలీ..!

వైసీపీకి మహేష్ బాబు అభిమానులు దూరం కానున్నారా...? ఒకప్పుడు వైసీపీకి అండగా ఉన్న ఫ్యాన్స్ ఇప్పుడు తప్పని పరిస్థితిలో టీడీపీకి సపోర్ట్ చేయాల్సి వస్తుందా..?

బాల‌య్య కామెంట్ 5 .. నాగ‌బాబు కౌంట‌ర్‌

ఎ.బి.ఎన్ ఆంధ్ర‌జ్యోతిలో వ‌చ్చిన కామెంట్‌ను ఐదో కామెంట్‌గా చూపెడుతూ ఓ మీటింగ్‌ స‌మ‌యం కావ‌డంతో త‌లా తోకా లేని పార్టీలు పుట్టుకొచ్చి అలాగా బ‌ల‌గా జ‌నాన్ని వెంటేసుకొని తిరుగుతున్న పార్టీల‌ను

బ‌న్నితో ర‌ష్మిక‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త‌దుప‌రి చిత్రాన్ని త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

రెమ్యున‌రేష‌న్ విష‌యంలో హీరోయిన్ పెద్ద మ‌న‌సు

సాధార‌ణంగా సినిమాలు డిజాస్ట‌ర్స్ అయిన‌ప్పుడు హీరోలు నిర్మాత‌ల‌కు రెమ్యున‌రేష‌న్స్ వెన‌క్కి ఇచ్చేయ‌డం చేస్తుంటారు.