NIA Checks:అనంతపురంలో ఎన్‌ఐఏ తనిఖీలు.. ఉగ్రవాదుల కదలికలపై ఆరా..!
Send us your feedback to audioarticles@vaarta.com
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటన మరో మలుపు తీసుకుంది. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) తన విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఆత్మకూర్ వీధికి చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. కొందరు యువకులకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ సమాచారంతో తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ ఇంట్లో సోదాలు చేసిన అధికారులు ఆయన కుమారుల గురించి ప్రశ్నించినట్లు సమాచారం.
అబ్దుల్ కుమారులు కొంతకాలంగా బెంగుళూరులో నివసిస్తున్నారు. వారిలో ఓ కుమారుడు సోహెల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సోహెల్ ఖాతాలో ఇటీవల అధిక మొత్తంలో నగదు జమ అయ్యినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై కూడా ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా గతంలోనూ ఎన్ఐఏ అధికారులు అనంతపురం పట్టణంలో అనుమానితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. తాజాగా రాయదుర్గంలో సోదాలు చేయడంతో ఒక్కసారిగా స్థానికంగా ఆందోళన నెలకొంది. అదే సమయంలో బెంగళూరు, తమిళనాడులోని కోయంబత్తూరు సహా 11 వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులకు దిగారు ఎన్ఐఏ అధికారులు. కోయంబత్తూరులో ఇద్దరు డాక్టర్లను అరెస్ట్ చేశారు.
కాగా ఈ ఏడాది మార్చి 1వ తేదీన బెంగళూరులోని ప్రఖ్యాత రామేశ్వరం కేఫ్‌లో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద ఎత్తున మారణహోమాన్ని సృష్టించాలనే ఉద్దేశంతోనే నిందితులు ఈ ఘటనకు పాల్పడ్డారని అధికారులు గుర్తించారు. ఉగ్రవాద కోణం బయటకు రావడంతో ఈ ఘటనపై ఎన్ఐఏ విచారణ చేస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments