సూర్య ఫస్ట్ హాఫ్ లో హీరో, సెకండ్ హాఫ్ లో విలన్ - 'ఎన్ జీ కే' డైరెక్టర్ శ్రీ రాఘవ
Send us your feedback to audioarticles@vaarta.com
'గజిని' 'సింగం' వంటి విలక్షణ చిత్రాలతో ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న సూర్య హీరోగా '7G బృందావన కాలనీ', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాలతో డిఫరెంట్ డైరెక్టర్ గా పేరొందిన శ్రీ రాఘవ దర్శకత్వంలో వినూత్న పంథాలో తెరకెక్కిన ఇంటెన్స్ పొలిటికల్ థ్రిల్లర్ 'ఎన్ జీ కే'. డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ మీద ప్రముఖ నిర్మాత కె కె రాధామోహన్ అందించారు. మే 31న విడుదలైన 'ఎన్ జీ కే' మంచి ఓపెనింగ్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సందర్భంగా ...
దర్శకుడు శ్రీ రాఘవ మాట్లాడుతూ, " సూర్య ఫస్ట్ హాఫ్ లో హీరో, సెకండ్ హాఫ్ లో విలన్ గా కారక్టరైజేషన్ ని డిఫరెంట్ గా చేశాము. అదే 'ఎన్ జీ కే' చూసిన ఆడియెన్స్ ని థ్రిల్ అయ్యేలా చేసింది. ఇంత మంచి ఓపెనింగ్స్ రావడానికి, సూర్య పెర్ఫార్మెన్స్ కి ట్రేమెండస్ అప్లాజ్ రావడానికి ఈ కారక్టరైజేషనే కారణం అయ్యింది.
సూర్య తో డిఫరెంట్ కేరక్టర్ చేయించారని అందరూ అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. 'ఎన్ జీ కే' సాధించిన విజయం అటు సూర్యకి దర్శకుడిగా నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. సాయి పల్లవి, రకుల్ ప్రీత్ కెరక్టర్లు డిఫరెంట్ గా ఉండడం వల్ల అందరినీ ఆకట్టుకుంటున్నాయి. యువన్ శంకర్ రాజా రి రికార్డింగ్ సినిమాకి మంచి ప్లస్ అయ్యింది. ఈ చిత్రాన్ని ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృజ్ఞతలు." అన్నారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments