AP Holidays:ఏపీలో వచ్చే ఏడాది సెలవులు ఇవే..
Send us your feedback to audioarticles@vaarta.com
వచ్చే ఏడాది సెలవుల జాబితాను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు 20 రోజులు సాధారణ సెలవులుగా, ఐచ్ఛిక(ఆఫ్షనల్ హాలిడేస్) సెలవులు 17 రోజులుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చంద్రుడి దర్శనం ప్రకారం ఇచ్చే రంజాన్, బక్రీద్, మొహరం, ఈద్ మిలాద్ నబీ వంటి పండుగలు, తిధులను బట్టి హిందూ పండుగల్లో మార్పులు వస్తే వాటిని ముందస్తుగా పత్రికా ప్రకటనల ద్వారా తెలియజేస్తామని వెల్లడించారు.
2024లో సాధారణ సెలవులు...
సంక్రాంతి జనవరి 15(సోమవారం), కనుమ 16(మంగళవారం), రిపబ్లిక్ డే జనవరి 26(శుక్రవారం),
మహాశివరాత్రి మార్చి 8(శుక్రవారం), హోలీ మార్చి 25(సోమవారం), గుడ్ ఫ్రైడే మార్చి 29(శుక్రవారం),
బాబు జగ్జీవన్‌రామ్ జయంత్రి ఏప్రిల్ 5(శుక్రవారం), ఉగాది ఏప్రిల్ 9(మంగళవారం),
రంజాన్ ఏప్రిల్ 11(గురువారం), శ్రీరామనవమి ఏప్రిల్ 17 (బుధవారం), బక్రీద్ జూన్ 17(సోమవారం),
మొహర్రం జూలై 17(బుధవారం), స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15 (గురువారం), శ్రీకృష్ణాష్టమి ఆగస్టు 26(సోమవారం),
వినాయకచవితి సెప్టెంబరు 7(శనివారం), ఈద్-మిలాద్-ఉన్-నబీ సెప్టెంబరు 16(సోమవారం),
గాంధీజయంతి అక్టోబరు 2 (బుధవారం), దుర్గాష్టమి అక్టోబరు 11(శుక్రవారం),
దీపావళి అక్టోబరు31(గురువారం), క్రిస్మస్ డిసెంబరు 25(బుధవారం)
ఆదివారం, రెండో శనివారం వచ్చిన సాధారణ సెలవులు...
భోగి జనవరి 14(ఆదివారం), డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఏప్రిల్ 14(ఆదివారం), విజయదశమి అక్టోబరు 12 (రెండో శనివారం)
ఐచ్ఛిక(ఆప్షనల్) సెలవులు..
జనవరి 1 కొత్త సంవత్సరం (సోమవారం), హజరత్ అలీ జయంతి జనవరి 25(గురువారం),
షబ్-ఏ-మీరాజ్ ఫిబ్రవరి 7(బుధవారం), షహాదత్ హజ్రత్ అలీ ఏప్రిల్ 1(సోమవారం),
జమాతుల్ విదా ఏప్రిల్ 5(శుక్రవారం), బసవ జయంతి మే 10(శుక్రవారం),
బుద్ధ పూర్ణిమ మే 23(గురువారం), ఈద్-ఏ-ఘదిర్ జూన్ 25(మంగళవారం),
మొహర్రం జూలై 16(మంగళవారం), పార్సీ న్యూ ఇయర్ డే ఆగస్టు 15(గురువారం),
వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 16(శుక్రవారం), మహాలయ అమావాస్య అక్టోబరు 2(బుధవారం),
యాజ్ దహుమ్ షరీఫ్ అక్టోబరు 10(గురువారం), కార్తీక పూర్ణిమ, గురు నానక్ జయంతి నవంబరు 15(శుక్రవారం),
హజరత్ సయ్యద్ మొహమ్మద్ జువాన్ పురి మహాది జయంతి నవంబరు 16(శనివారం),
క్రిస్మస్ ఈవ్ డిసెంబరు 24(మంగళవారం), బాక్సింగ్ డే డిసెంబరు 26(గురువారం)
ఆదివారాలు వచ్చిన ఆప్షనల్ హాలిడేస్...
షబ్-ఏ-బరాత్ ఫిబ్రవరి 25, షబ్-ఏ-ఖదర్ ఏప్రిల్ 7, మహావీర్ జయంతి ఏప్రిల్ 21, రథయాత్ర జూలై 7, అర్బయీన్ ఆగస్టు 25
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout