Next Nuvve Review
హారర్ కామెడీ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది. ప్రేక్షకుల ఆదరణతో పాటు కలెక్షన్స్ పరంగా కూడా సినిమాలు మంచి సక్సెస్‌లను సాధిస్తుండటంతో దర్శక నిర్మాతలందరూ హారర్ కామెడీ చిత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. పర భాషా హారర్ కామెడీ చిత్రాలను కూడా తెలుగులోరీమేక్ చేస్తున్నారు. ఆ కోవలో తమిళంలో మంచి విజయాన్ని సాధించిన 'యామిరక్క భయమే' సినిమాను తెలుగులో `నెక్స్ట్ నువ్వే ` పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. ఆది, వైభవి, రష్మీ గౌతమి నటించిన ఈ చిత్రాన్ని టీవీ సీరియల్స్ దర్శక నిర్మాత, నటుడు ప్రభాకర్ తెరకెక్కించడం విశేషం. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల నుండి ఎలాంటి ఆదరణ పొందిందో తెలుసుకోవాలంటే సినిమా కథేంటో తెలుసుకుందాం...
కథాంశం:
కిరణ్(ఆది) ఓ సీరియల్ డైరెక్టర్. ఎలాగైనా రాజమౌళి అంత పేరు తెచ్చుకోవాలనుకుని పడే ప్రయాసలన్నీ వృథా అవుతుంటాయి. తనే దర్శక నిర్మాతగా మారి ఓ సీరియల్‌ను తెరకెక్కిస్తాడు. జెపి(జయప్రకాష్) దగ్గర అప్పు చేసి తీసిన సీరియల్ సక్సెస్ కాకపోవడంతో అప్పుల పాలవుతాడు కిరణ్. ఆ సమయంలో తన తండ్రి (పోసాని) తనకు ఓ ప్యాలెస్ రాసి పెట్టాడని తెలుసుకుని, ఆ ప్యాలెస్‌ణు రిసార్ట్‌గా మార్చాలనుకుంటాడు. అందుకోసం జెపి తనయుడు(అదుర్స్ రఘు)కి మాయ మాటలు చెప్పి 50 లక్షలు అప్పు తీసుకుని ప్యాలెస్‌ను బాగు చేయిస్తాడు. కిరణ్ తన లవర్ స్మిత(వైభవి)తో కలిసి రెస్టారెంట్‌కు వస్తాడు. అక్కడే శరత్(బ్రహ్మాజీ), అతని చెల్లెలు రష్మీ(రష్మీ గౌతమి) కూడా ఉంటారు. ఆ రిసార్ట్‌కు వచ్చే కస్టమర్స్ అందరూ చనిపోతూ ఉంటారు. అసలు అలా ఎందుకు చనిపోతున్నారనే విషయం కిరణ్‌కు అర్థం కాదు. అలా చనిపోయినవారు మనుషులు కారని, ఒకప్పుడు ప్యాలెస్ యజమానులే చనిపోయి దెయ్యాలుగా మారారని కిరణ్‌కు తెలుస్తుంది. అప్పుడు కిరణ్ ఏం చేస్తాడు? అసలు కిరణ్ ప్యాలెస్ నుంచి బయటపడ్డాడా లేదా? అనేదే సినిమా..
విశ్లేషణ:
దర్శకుడు ప్రభాకర్‌కి ఇదే తొలి సినిమా అయినా.. రీమేక్ అనే సేఫ్ గేమ్‌తో కెరీర్‌ని మొదలుపెట్టాడు. ఒరిజనల్ వెర్షన్‌లో ఉన్న స్క్రీన్‌ప్లేనే యధాతథంగా వాడుకునే ప్రయత్నం చేశాడు. అయితే, హారర్ ఎలిమెంట్స్ కంటే.. కామెడీ ఎలిమెంట్స్‌నే ఈ సినిమాలో బాగా వర్కవుట్ అయ్యాయి. దానికి తోడు నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకోవడంలో ప్రభాకర్ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా శరత్ పాత్రలో బ్రహ్మాజీ సినిమాకి బాగా ప్లస్ అయ్యాడు. ప్రథమార్థంలో చాలా సన్నివేశాలు నవ్విస్తాయి. ముమైత్ సీన్‌తో పాటు.. షకీలా, బ్రహ్మాజీ ఎపిసోడ్.. అలాగే బెనర్జీపై తీసిన ఇచ్‌గార్డ్ ఎపిసోడ్.. సత్యకృష్ణన్ ఎపిసోడ్.. అలాగే సెకండాఫ్‌లో రఘుబాబుపై తీసిన ఎపిసోడ్.. హిలేరియస్‌గా ఉన్నాయి. ఇవన్నీ సినిమాని పైసా వసూల్ అనిపిస్తాయి. ఇక హిమజపై తీసిన హర్రర్ ఎపిసోడ్స్.. భయపెట్టడం కంటే నవ్వించడంలోనే సక్సెస్ అయ్యాయి. ఓవరాల్‌గా సినిమాని చూడడానికి వచ్చే ఆడియన్స్‌ని కామెడీ విషయంలో ఈ సినిమా శాటిస్ ఫై చేస్తుంది.
ప్లస్ పాయింట్స్:
- బ్రహ్మాజీ నటన
- సినిమాను అసాంతం కామెడీగా నడిపించే ప్రయత్నం
- నిర్మాణ విలువలు
- నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్:
- హారర్ పాయింట్ తేలిపోవడం
- లాజిక్స్‌కు చాలా దూరంగా ఉండే కథ
- యావరేజ్ క్లైమాక్స్
విశ్లేషణ:
కాన్సెప్ట్ ప్రధానంగా రూపొందిన ఈ చిత్రంలో ఆది తన పాత్రకు తగ్గట్లు నటించాడు. ఎక్కడా ఓవర్ హీరోయిజం చూపించే ప్రయత్నం మనకు కనపడదు. అలాగే హారర్ సన్నివేశాల్లో వైభవి నటన బావుంది. ఈ సినిమాకు శరత్ పాత్రలో కనపడ్డ బ్రహ్మాజీ ప్రధానమైన ఎసెట్‌గా నిలిచాడు. సినిమా ఆసాంతం బ్రహ్మాజీ పాత్ర, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను మెప్పించడం ఖాయం. అలాగే సినిమాలో రఘబాబు, పృథ్వీ, ఎల్బీ శ్రీరాం, అవసరాల శ్రీనివాస్ తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక దర్శకుడు ప్రభాకర్ తొలి చిత్రంలో దర్శకుడిగా తన మార్కును చూపించే ప్రయత్నం చేశాడు. సాయికార్తీక్ బ్యాగ్రౌండ్ స్కోర్ హారర్ సీన్స్‌ను చక్కగా ఎలివేట్ చేశాయి. మాస్‌కు నచ్చే మాస్ మసాలా ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయి. కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ అభినందనీయం.
బోటమ్ లైన్: నెక్స్ట్ నువ్వే... హారర్ కంటే కామెడీకే ప్రాధాన్యం
Next Nuvve Movie Review in English
- Read in English