సెన్సార్ పూర్తి చేసుకున్న నెక్ట్స్ నువ్వే

  • IndiaGlitz, [Saturday,October 14 2017]

ఆదిసాయికుమార్ హీరోగా, ప్ర‌భాక‌ర్.పి ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ వి4 మూవీస్ బ్యాన‌ర్ లో ప్ర‌ముఖ నిర్మాత బ‌న్ని వాసు నిర్మిస్తున్న చిత్రం ఇటీవ‌లే షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది.ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి సంబందించి ట్రైల‌ర్ ఇటీవ‌లే విడ‌దల‌య్యి మంచి స్పంద‌న పొందుతుంది. హీలేరియ‌స్ కామెడి థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో వైభ‌వి, ర‌ష్మి లు హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని సాయి కార్తిక్ సూప‌ర్బ్ గా అందించారు. సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్త‌చేసుకుని న‌వంబ‌ర్ 3న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏ స‌ర్టిఫికేట్ తో విడులవుతుంది.

నిర్మాత బ‌న్ని వాసు మాట్లాడుతూ.. వి4 మూవీస్ బ్యాన‌ర్ లో ప్రోడ‌క్ష‌న్ నెం1 గా తెర‌కెక్కిస్తున్న చిత్రం నెక్స్‌నువ్వే న‌వంబ‌ర్ 3 న విడుద‌ల చేస్తున్నాం. ఈచిత్రంతో ప్ర‌భాక‌ర్‌.పి ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నాడు. మంచి కాన్సెప్ట్ ఆడియ‌న్స్ ని ఎంట‌ర్‌టైన్ చెయ్య‌టమే ల‌క్ష్యం గా ఈ చిత్రాన్ని చేశాము. ఇటీవ‌ల ఆడియో విడుద‌ల‌య్యి మంచి విజ‌యం సాధించింది. మా ఆడియో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల ప్ర‌శంశ‌లు పొందుతుంది. "అరే భూగోళం ఎక్క‌డ చూసినా డ‌బ్బుకు లోకం దాసోహం.. అది లేకుండా ఓ రోజైనా బ్ర‌త‌క‌డ‌మంటే మా క‌ష్టం.. అరే ఈ ప‌చ్చ‌ని నోటుకు ప్రాణం పోసిన‌వాడస‌లెవ్వ‌డురా.. న్యూట‌న్ ఫార్ముల‌క‌న్నామించిన ఆక‌ర్ష‌ణ ఈ నోటుదిరా..డ‌బ్బే ప‌రిగె్తే గుర్రం.. డబ్యే ప‌దిల‌క్ష‌ల సైన్యం అబ్యో ఈ డ‌బ్బులు ఇచ్చే కిక్కే వేరండోయ్‌."

అంటూ సాగే పాట ఈ నాటి విలువ‌లు ఎలా వున్నాయో తెలియ‌జేసేలా వుంటుంది. క్యాచి గా యూత్ అంద‌రూ పాడుకునేలా వుంది. " ఆచి దోచి అచ్చిన‌క‌రి దాచి ...ఆచి దోచి అచ్చిన‌క‌రి దాచి " అని సాగే సాంగ్ చిన్న పిల్లల్ని ఆక‌ట్టుకుంటుంది. అలాగే కొత్త సౌండింగ్ తో మా మ్యూజిక్ ద‌ర్శ‌కుడు సాయికార్తిక్ చాలా కొత్త సౌండ్ ఇచ్చారు.. సినిమా ఫ్లాట్ తెలిసేలా చాలా బాగా అందిచారు. "అలా మేడ మీద ఎలా వాలేన‌మ్మా ప‌దారేళ్ళ జాబిల్లే జానై.. మేఘంలా నేనే మారానా నిన్నే చేర‌నా..తాకే వాన‌వ‌నా..శ్వాసైనా ఇలా వీడ‌నా నిన్నే చూడ‌నా...." అంటూ చ‌క్క‌ని మెలోడి అంద‌రి హ్రుద‌యాల్లో స్థానం సంపాయించింది ఈ సాంగ్‌.. ఆడియో నే కాదు స్క్రీన్ మీద కూడా అంద‌ర్ని ఆక‌ట్ట‌కుంటుంది.

ఈ సాంగ్ ని అవ‌స‌రాల శ్రీనివాస్ మ‌రియు హిమ‌జ మీద చిత్రీక‌రించాము.. చిత్రంలో ఈసాంగ్ చాలా ఇంపార్టెంట్ వుంటుంది. అలాగే ఈ చిత్రంలో హీరో ఆదిసాయికుమార్ పాత్ర చాలా బాగుంటుంది. ఆదిసాయికుమార్ కెరీర్ లో ఇది మంచి విజ‌యం గా నిలుస్తుంది. వైభ‌వి, ర‌ష్మి, అవ‌స‌రాల శ్రీనివాస్, బ్ర‌హ్మ‌జి, ర‌ఘు మంచి పాత్ర‌ల్ల క‌నిపిస్తారు. సెన్నారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది. ఏ సర్టిఫికేట్ తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా న‌వంబ‌ర్ 3న విడుద‌లవుతుంది. హ‌ర్ర‌ర్‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్ గా ఈ చిత్రం తెర‌కెక్కింది. అని అన్నారు

న‌టీన‌టులు.. ఆది సాయికుమార్‌, వైభ‌వి, రేష్మి, బ్ర‌హ్మ‌జి, అవ‌స‌రాల శ్రీనివాస్‌, హిమ‌జ‌, జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి, పృధ్వి, ఎల్‌.బి.శ్రీరామ్‌, ర‌ఘుబాబు, పోసాని కృష్ణ‌ముర‌ళి, ర‌ఘు, బెన‌ర్జి, తాగుబోతు ర‌మేష్‌, ముమైత్ ఖాన్‌, ర‌జిత‌, స‌త్య‌కృష్ణ‌, దువ్వాసి మెహ‌న్‌, రామ్ జ‌గ‌న్‌, గెట‌ప్ శ్రీను, శ్రీచ‌ర‌ణ్‌, రాఘ‌వ‌, అనురాగ్‌, సుభాష్‌, మ‌న్న‌న కొటేశ్వ‌రావు, ల్యాబ్ శ‌ర‌త్‌, ర‌మాదేవి, అనిత‌, క‌ళ్యాణి, ర‌మ‌ణి, ఆర్‌జె రాజు, ప్రేం సాగ‌ర్‌, సందీప్‌, సంజ‌య్‌, శివ‌, విక్ర‌మ్‌,రోహిణి, షాన్‌, సాత్విక్‌, మాధ‌వి, ప్రియ‌, భాషా, షా, స‌త్య‌శ్రీ, సుకుమార్‌, మ‌హ‌తి, శ్రీధ‌ర్‌, దావూద్‌, మాస్ట‌ర్ లికిత్ త‌దిత‌రులు..

సాంకేతిక‌నిపుణులు.. సంగీతం- సాయికార్తీక్ , క‌థ‌- డి.కె, మాట‌లు- శ్రీకాంత్ విస్సా,నిరుప‌మ్ ప‌రిటాల‌, పాట‌లు- కె కె సాగ‌ర్‌, ఫోటోగ్ర‌ఫి- కార్తిక్ ప‌ళ‌ని, ఎడిటింగ్‌- ఎస్‌.బి.ఉద్ద‌వ్‌, ఆర్ట్‌- శ్రీకాంత్‌, డాన్స్‌- విశ్వ‌రఘు, ఫైట్స్‌- శ్రీధ‌ర్‌, విజువ‌ల్ ఎఫెక్స్‌- పిక్స‌లాయిడ్‌, ప‌బ్లిసిటి డిజైన‌ర్‌- ధ‌నిఏలే, స్టిల్స్‌- పాలా వెంక‌టేష్‌, ఎఫ్‌.డి.సి- నాగేశ్వ‌రావు, పి.ఆర‌.ఓ- ఏలూరు శ్రీను, మేక‌ప్‌- ఐ.శ్రీనివాస‌రాజు, కాస్ట్యూమ్స్‌- షాజి, కాస్ట్యూమ్స్ డిజైన‌ర్స్‌- ఆండోల్ సి.కె (ఆది, వైభ‌వి), కీర్త‌న సునీల్(ర‌ష్మి), ప్రోడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌- కొచ్చ‌ర్ల స‌త్య‌శివ‌కుమార్‌, ప్రోడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌- ఎ.ఎస్‌.వి.ఎస్‌.ఎస్ సుభ్ర‌మ‌ణ్యం, అసిస్టెంట్స్- ప్ర‌వీణ్, ద‌త్తు, అసిస్టెంట్ డైర‌క్ట‌ర్స్‌- సుబ్బు, ముర‌ళి, అసోసియోట్ డైర‌క్ట‌ర్స్‌- బి.ర‌వికిర‌ణ్‌, సుకుమార్‌, కొ-డైర‌క్ట‌ర్స్‌- పృధ్వివ‌ర్మ‌, ఎస్‌.శ్రీనివాస‌రావు, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌- స‌త్య గ‌మిడి, కొ-ప్రోడ్యూస‌ర్‌- ఎస్‌.కె.ఎన్‌

ప్రోడ్యూస‌ర్- బన్నివాసు. స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వం- ప్ర‌భాక‌ర్‌.పి