అక్టోబర్ 7న నెక్ట్స్ నువ్వే ఆడియో

  • IndiaGlitz, [Monday,October 02 2017]

ఆదిసాయికుమార్ హీరోగా, ప్ర‌భాక‌ర్.పి ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ వి4 మూవీస్ బ్యాన‌ర్ లో ప్ర‌ముఖ నిర్మాత బ‌న్ని వాసు నిర్మిస్తున్న చిత్రం ఇటీవ‌లే షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది.ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి సంబందించి ట్రైల‌ర్ ఇటీవ‌లే విడ‌దల‌య్యి మంచి స్పంద‌న పొందుతుంది. హీలేరియ‌స్ కామెడి థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో వైభ‌వి, ర‌ష్మి లు హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని సాయి కార్తిక్ అందించారు. ఆయ‌న అందించిన ఆడియో ని అక్టోబ‌ర్ 7 న గ్రాండ్ గా విడుద‌ల చేస్తున్నారు.

నిర్మాత బ‌న్ని వాసు మాట్లాడుతూ.. వి4 మూవీస్ బ్యాన‌ర్ లో ప్రోడ‌క్ష‌న్ నెం1 గా తెర‌కెక్కిస్తున్న చిత్రం నెక్స్‌నువ్వే.. ఈ చిత్రం తో ప్ర‌భాక‌ర్‌.పి ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నాడు. మంచి కాన్సెప్ట్ ఆడియ‌న్స్ ని ఎంట‌ర్‌టైన్ చెయ్య‌టమే ల‌క్ష్యం గా ఈ చిత్రాన్ని చేశాము. ఇటీవ‌ల ట్రైల‌ర్ ని విడుద‌ల చేశాము. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల ప్ర‌శంశ‌లు పొందుతుంది. హీరో ఆదిసాయికుమార్ పాత్ర చాలా బాగుంటుంది. ఆదిసాయికుమార్ కెరీర్ లో ఇది మంచి విజ‌యం గా నిలుస్తుంది. వైభ‌వి, ర‌ష్మి, అవ‌స‌రాల శ్రీనివాస్, బ్ర‌హ్మ‌జి, ర‌ఘు మంచి పాత్ర‌ల్ల క‌నిపిస్తారు. ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని శ‌ర‌వేగంగా పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. హీలేరియ‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ గా ఈ చిత్రం తెర‌కెక్కింది. సాయికార్తిక్ అందించిన సూప‌ర్ ఆడియో ని అక్టోబ‌ర్ 7న విడుద‌ల చేస్తున్నాము. చిత్రాన్ని న‌వంబ‌ర్ 3న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నాము. అని అన్నారు.

More News

స్పైడర్ కు కొత్త చిక్కు.

సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్పైడర్ సినిమా దసరా సందర్భంగా సెప్టెంబర్ 27న విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా కలెక్షన్స్ పరంగా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టుకోలేకపోయింది.

'సుందరకాండ'కి 25 ఏళ్లు

రీమేక్ చిత్రాలను చేయడంలో ముందుండే తెలుగు కథానాయకుల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఆయన రీమేక్ చేసిన చిత్రాల్లో సింహభాగం సక్సెస్ అయ్యాయి కూడా. అలా ఘనవిజయం సాధించిన చిత్రాలలో సుందరకాండ ఒకటి.

ఎన్టీఆర్ హ్యాట్రిక్

ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన చిత్రం జైలవకుశ. సెప్టెంబర్ 21న విడుదలైన ఈ చిత్రం వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఓవర్సీస్లో ఈ చిత్రం తాజాగా 1.5 మిలియన్ డాలర్లను క్రాస్ చేసింది.

విశాఖకు మహానుభావుడు చిత్ర బృందం

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ అధ్వర్యంలో విశాఖ సాగర తీరంలో జరుగుతున్న దసరావళి ఉత్సవాలకు మహానుభావుడు చిత్రయూనిట్ హాజరుకానున్నారు.

ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఉపాధ్యక్షుడుగా ముళ్ళపూడి మోహన్

ఇటీవల జరిగిన ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (FNCC) ఎన్నికలలో శ్రీ ముళ్ళపూడి మోహన్ గారు భారీ ఆధిక్యతతో ఉపాధ్యక్షుడు గా ఎన్నికైనారు.