తదుపరి కూడా అదే దర్శకుడితో....
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ స్టార్ హీరో అజిత్ 59 వ చిత్రం `నేర్కొండ పార్వై`. బాలీవుడ్ చిత్రం `పింక్`కు ఇది తమిళ రీమేక్. అమితాబ్ పాత్రను అజిత్ పోషిస్తున్నారు. తాప్సీ పాత్రను శ్రద్ధా శ్రీనాథ్ పోషిస్తున్నారు. హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కోర్టు డ్రామా ఆగస్ట్ 10న విడుదల కానుంది. ఆసక్తికరమైన విషయమేమంటే అజిత్ తన తదుపరి సినిమా అంటే 60 వ సినిమాను కూడా వినోద్ దర్శకత్వంలోనే చేయబోతున్నాడట. వినోద్ స్క్రిప్ట్‌తోనే ఈ సినిమా రూపొందనుండగా.. బోనీకపూర్ నిర్మాణంలో సినిమా రూపొందనుంది. దర్శకుడు శివతో వరుసగా నాలుగు సినిమాలు చేసిన అజిత్ ఇప్పుడు వినోద్‌తోనే రెండో సినిమా చేయనుండటం కొసమెరుపు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments