న్యూజిలాండ్ హీరోయిన్ నారా రోహిత్...
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీ కీర్తి ఫిలింస్ బ్యానర్ పై నారా రోహిత్ హీరోగా నటిస్తున్న చిత్రంలో న్యూజిలాండ్ కి చెందిన లతా హెగ్డే అనే కొత్త అమ్మాయిని హీరోయిన్ గా ఎంపిక చేశారు. గుండెల్లో గోదారి, జోరుల ఫేమ్ కుమార్ నాగేంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కబీర్ సింగ్, అలీ, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. ఇటీవల కర్ణాటకలో తొలి షెడ్యూల్ ను పూర్తి చేసకున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఈ చిత్రానికి కథ: ఎ.ఆర్.మురగదాస్, సంగీతం: సాయికార్తీక్, ఎడిటర్: మధు, ఆర్ట్: మురళి కొండేటి, సినిమాటోగ్రాఫర్: ఎం.ఆర్.పళనికుమార్, నిర్మాతలు: అశోక్ బాబా, నాగార్జున, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కుమార్ నాగేంద్ర.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments