ఇండియాపై న్యూయార్క్ స్వాతి వీడియో.. నెట్టింట్లో వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఈ వైరస్ బారిన ఎవరెప్పుడు పడుతున్నారో..? ఎంతమంది చనిపోతున్నారా లెక్కలు తెలియని పరిస్థితి. మరీ ముఖ్యంగా అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, చైనా దేశాల్లో లెక్కలేనంత మంది చనిపోతున్నారు. ఈ మరణాల సంఖ్యను కొన్ని దేశాలు తేల్చిచెబుతున్నా.. మరికొన్ని మాత్రం దొంగలెక్కలు చెప్పేస్తున్నాయ్. ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు మరీ ఎక్కువగా అయిపోతున్నాయ్. అమెరికాలాంటి అ్రగరాజ్యంలో అయితే రోజుకు 15వేల పై చిలుకు కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మరణాల సంఖ్య అయితే రోజుకు ఎంతో.. చనిపోయినవారిని పూడ్చడానికి కూడా ఎవరూ దొరకని పరిస్థితుల్లో అమెరికా విలవిలాడుతోంది. మరోవైపు ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లో అయితే మరీ ఘోరం.
సీన్ రివర్స్..
అయితే ఇండియాలో మాత్రం అలాంటి పరిస్థితులు దాదాపు లేవు. కరోనా వ్యాధి ఇండియాలో విస్తరిస్తే, శవాల గుట్టలేనన్న దేశాలు అప్పట్లో ఎగతాళి చేస్తూ మాట్లాడాయి. ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. అప్పుడు అలా అన్న వాళ్లే ఇప్పుడు నోరెళ్లబెట్టి చూస్తూ.. సాయం చేయండి మహాప్రభో అని అడుక్కుంటున్న పరిస్థితి. ఇందుకు అగ్రరాజ్యం అమెరికానే కారణం. తాజాగా న్యూయర్క్‌లో ఉంటున్న మన తెలుగు యువతి షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ‘మేరా భారత్ మహాన్’ అంటూ ప్రపంచ దేశాలకి మన ఇండియాకు ఇప్పుడున్న పరిస్థితిలో వ్యత్యాసాన్ని ఆమె వివరించారు.
ఇదీ తేడా..
‘అభివృద్ధి చెందిన దేశం అమెరికా. కరోనా మహమ్మారి కారణంగా కకావికలమైంది. భారత్‌లోని పరిస్థితులను చూస్తే చాలా ముందుగానే అలెర్ట్ అయ్యారు. అగ్రరాజ్యంతో ఆధునిక జీవన విధానానికి.. ఇండియాలో పేదరికానికి చాలా తేడా ఉంది. కరోనా వైరస్ నియంత్రణలో అమెరికాలో.. ఇండియాలో ఎలా ఉందో చెప్పదలుచుకున్నాను. ఇండియా ముందుగానే మేల్కొంది. కరోనా వ్యాధి ఇండియాలో విస్తరిస్తే.. శవాల గుట్టలేనన్న దేశాలు ఇప్పుడు నోరెళ్లబెట్టి చూస్తున్నాయి. ఇప్పుడు భారతావని ఎన్నో దేశాల ప్రశంసలను అందుకుంటోంది. కరోనాకు ఔషధాల కోసం ఎన్నో దేశాలు భారత్ వైపే చూస్తున్నాయి’ వీడియోలో చెప్పుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరోవైపు యూ ట్యూబ్‌లోనూ ట్రెండింగ్‌లో ఉంది. ఈ వీడియోను వేలాది మంది షేర్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout