ఏపీకి పాకిన కొత్త కరోనా వైరస్...
Send us your feedback to audioarticles@vaarta.com
నిన్న మొన్నటి వరకూ ఏపీలో కరోనా కేసులు తీవ్రంగా ఉండేవి.. ఈ మధ్యే కరోనా కలకలం బాగా తగ్గిపోయి కాస్త సేఫ్ జోన్లోనే ఉందని చెప్పాలి. అయితే తాజాగా రాష్ట్రంలోకి కొత్త కరోనా వైరస్ ప్రవేశించి తిరిగి భయాందోళనలోకి నెట్టివేసింది. అసలు విషయంలోకి వెళితే.. రాజమహేంద్రవరం రూరల్ మండలం హుక్కుంపేట సమీపంలోని రామకృష్ణనగర్‌కు చెందిన ఆంగ్లో ఇండియన్ మహిళకు కొత్త కరోనా వైరస్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆమె ఈ నెల 22న యూకేలో కరోనా పరీక్షలు చేయించుకుని ఫలితం రాకముందే.. అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి వచ్చారు.
ఆమెను రిసీవ్ చేసుకునేందుకు ఆమె కుమారుడు ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కూడా సదరు మహిళకు కరోనా పరీక్షలు చేశారు. అయితే ఫలితం వచ్చే వరకూ ఆమె అక్కడే క్వారంటైన్లో ఉండాల్సిందిగా అధికారులు సూచించారు. కానీ ఆమె అక్కడి నుంచి పరారై కొడుకుతో కలిసి రాజమహేంద్రవరం రావడానికి బయలుదేరారు. ఆమె ఢిల్లీ నిజాముద్దీన్ ట్రైన్ ఎక్కినట్టు పోలీసులు ధ్రువీకరించుకున్నారు. అర్ధరాత్రి ఆమె రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌కు చేరుకోనుంది. ఆమె ట్రైన్ దిగిన వెంటనే ఆసుపత్రికి తరలించాలా, హోం క్వారంటైన్లో ఉంచాలా అనే తర్జనభర్జన కొద్దిసేపు జరిగింది.
కాగా.. కొత్త కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించిన ఢిల్లీ వైద్యాధికారులు వెంటనే ఏపీ ప్రభుత్వానికి సమాచారం అందించినట్టు తెలుస్తోంది. అయితే బాధిత మహిళతో పాటు ఆమె కుమారుడి ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో ప్రభుత్వ అధికారులు భయాందోళన చెందారు. ఢిల్లీ నిజాముద్దీన్ ట్రైన్ వచ్చే సమయానికి రాజమండ్రి అధికారులు రైల్వే స్టేషన్‌కు చేరుకుని.. ఆమెను నేరుగా కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. రాజమహేంద్రవరం అర్బన్ పోలీసులను, వైద్య విభాగాన్ని అప్రమత్తం చేశారు. ఆమె ఆచూకీ తెలిసిన తర్వాత రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్‌కు తరలించాలని బాధితురాలిని అధికారులు తరలించారు. బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ నేపథ్యంలో రాజమండ్రిలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout