శ్యామ్.కె.నాయుడు కేసులో న్యూ ట్విస్ట్.. అదనంగా మరో కేసు..
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమాటోగ్రాఫర్ ఛోటా.కె.నాయుడు తమ్ముడు.. శ్యామ్.కె.నాయుడు కేసులో న్యూ ట్విస్ట్ వెలుగు చూసింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు రద్దు చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడంటూ సినీ ఆర్టిస్ట్ సాయి సుధ శ్యామ్ కె నాయుడిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కసులో శ్యామ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. కాగా ఆయన బాధితురాలితో కాంప్రమైజ్ అయినట్టు బాధితురాలి సంతకంతో పిటిషన్ వేసి బెయిల్ పొంది రెండు రోజుల్లోనే బయటకు వచ్చారు.
విషయం తెలుసుకున్న బాధితురాలు తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని.. తాను కంప్రమైజ్ అవడం అనేది కల్పితమని శ్యామ్ బెయిల్ పిటిషన్‌ను సవాల్ చేస్తూ మరోసారి కోర్టును ఆశ్రయించింది. తాను ఒప్పుకోలేదని తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని సాయ సుధ కోర్టుకు వెల్లడించింది. దీనిపై విచారణ నిర్వహించిన కోర్టు శ్యామ్ బెయిల్ పిటిషన్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆల్రెడీ ఉన్న కేసుతో పాటు శ్యామ్ కె నాయుడిపై ఫోర్జరీ కేసు కూడా నమోదైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout