డిశ్చార్జ్ అయిన కనికాకు కొత్త చిక్కులు!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి బారి నుంచి బాలీవుడ్ ప్రముఖ గాయని కనికాకపూర్ ఎట్టకేలకు కోలుకున్న సంగతి తెలిసిందే. గత 14 రోజులకుపైగా కరోనాపై పోరాడిన ఆమె ఎట్టకేలకు విజయం సాధించించి సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. అయితే వరుసగా నాలుగుసార్లు టెస్ట్‌లు చేసినప్పటికీ ఆమెకు నెగిటివ్ రావడం.. ఆ తర్వాత రెండుసార్లు నెగిటివ్ రావడంతో కనికాను డిశ్చా్ర్జ్ చేయడం జరిగింది. ఆస్పత్రి నుంచి ఆమె డిశ్చార్జ్ అయినా ఆమెకు చిక్కులు తప్పేలాలేవు.
ఇప్పటికే.. మార్చి 20కు ముందు కనికా పలు పబ్లిక్ పార్టీలకు హాజరైంది. విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఎవరైనా సరే కచ్చితంగా క్వారంటైన్‌లో ఉండాలని ప్రభుత్వం సూచించినప్పటికీ ఆమె మాత్రం ఆ ఆదేశాలను లెక్కచేయకుండా తిరిగిందని చీఫ్ మెడికల్ ఆఫీసర్ కనికా కపూర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాతే ఆమె ఆస్పత్రిలో జాయిన్ అయ్యింది. అయితే.. 14 రోజులు ముగిసిన తర్వాత పాత కేసులో విచారణ జరపాలని పోలీసులు నిర్ణయించారని సమాచారం.
ప్రభుత్వ అధికారి ఆదేశాలను ఉల్లంఘించడం, ప్రాణాంతక వ్యాధిని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నించడం లాంటి చర్యలపై ఆమెను ప్రశ్నించనున్నారు. అంతేకాదు.. గతంలో నమోదైన ఓ కేసుకు సంబంధించి ఆమెపై యూపీలోని లక్నో పోలీసులు విచారణ జరిపే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆమె క్వారంటైన్‌లో ఉండటంతో 14 రోజుల తర్వాత ఆమెను పోలీసులు విచారించనున్నారు. ఈ విషయాన్ని ఓ ప్రముఖ జాతీయ మీడియా తన వెబ్‌సైట్‌లో తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments