ఆర్జీవీకి కొత్త సమస్య!!
Send us your feedback to audioarticles@vaarta.com
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ లాక్డౌన్ సమయంలోనూ వరుస సినిమాలను విడుదల చేస్తూ అందరికీ షాకిస్తుంటే.. వర్మకు మాత్రం మరొకరు షాకిస్తున్నారట. వర్మకే షాకిచ్చేవారున్నారా? ఎవరంటే పైరసీదారులు. వర్మ తన సినిమాలను ఆర్జీవీ వరల్డ్ థియేటర్ ద్వారా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. క్లైమాక్స్, నగ్నం, కరోనా వైరస్, పవర్‌స్టార్ చిత్రాలను ఏటీటీ ద్వారా వర్మ విడుదల చేశాడు. ప్రతి సినిమాకు టికెట్‌పై ఇంత డబ్బు అని పెట్టి వసూలు చే్స్తూ వచ్చాడు. ఇప్పటి వరకు వర్మ డబ్బులు బాగానే సంపాదించుకున్నాడని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. అయితే పవర్‌స్టార్ విషయంలో వర్మకు కాస్త గట్టి దెబ్బే తగిలిందని సినీ వర్గాలు అంటున్నాయి. అది కూడా పైరసీ రూపంలో అంటున్నారు.
ఎందుకంటే.. ఆర్జీవీ ‘పవర్‌స్టార్’ను విడుదల చేసిన గంటలోపే సదరు సినిమా పైరసీ నెట్టింట్లోకి వచ్చేసింది. దీంతో సినిమాను డబ్బులు కట్టి చూడాలనుకున్న ప్రేక్షకులు ఇంకేం అవసరముందిలే అనుకున్నారు. ఇప్పుడు వర్మ తదుపరి చిత్రాలకు కూడా అదే పరిస్థితి మొదలవుతుందని టాక్. ఎందుకంటే.. వర్మ సినిమాను విడుదల చేసిన కొద్ది సేపటికే ఎలాగూ పైరసీ కాపీ వచ్చేస్తుంది. కాబట్టి టికెట్ కొనాలనుకున్న ఆలోచన ఉన్నవారు కూడా ఇకపై టికెట్ కొనే అవకాశం లేదని అంటున్నారు. ఇది ఓ రకంగా ఆర్జీవీకి సమస్యే అని వార్తలు వినిపిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments